నెల‌కొక సినిమాతో సంద‌డి చేయ‌నున్న అక్కినేని ఫ్యామిలీ!

Akkineni Heroes Back To Back Films, Akkineni Heroes Next Films List, Akkineni Heroes To Entertain Their Fans With Back To Back Movies, Akkineni Heroes Upcoming Movies List, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Akkineni Heroes To Entertain Their Fans With Back To Back Movies

గత ఏడాది ‘యూటర్న్’(అక్కినేని సమంత), ‘శైలజారెడ్డి అల్లుడు’(అక్కినేని నాగచైతన్య), ‘దేవదాస్’(అక్కినేని నాగార్జున) చిత్రాలతో సెప్టెంబర్ నెల‌ను టార్గెట్ చేసిన అక్కినేని ఫ్యామిలీ… ఈ సంవ‌త్స‌రం మూడు వరుస నెలలను టార్గెట్ చేయడం వార్త‌ల్లో నిలుస్తోంది. జూలైలో సామ్‌, ఆగ‌స్టులో నాగ్‌, సెప్టెంబ‌ర్‌లో చైతూ… ఇలా నెల‌కో సినిమాతో సంద‌డి చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… సమంత ప్రధాన పాత్ర‌లో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే… నాగార్జున హీరోగా నటిస్తున్న‌ ‘మన్మథుడు 2’ (‘మన్మథుడు’కి సీక్వెల్) ఆగస్టు 9న విడుదల కానుంది. ఇక సెప్టెంబ‌ర్ విష‌యానికి వ‌స్తే… అక్కినేని నాగ చైతన్య ఓ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ మల్టీస్టారర్ ఫిలిమ్‌ ‘వెంకీమామ’ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

ఇలా… నెలకొక సినిమాతో ప‌ల‌క‌రించ‌నున్న‌ అక్కినేని ఫ్యామిలీ (సామ్, నాగ్, చైతూ)… ఆ యా చిత్రాల‌తో ప్రేక్షకులను ఏ మేరకు ఎంట‌ర్‌టైన్ చేస్తుందో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=c0frjVPcTKc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =