ఓటర్ తెలుగు మూవీ రివ్యూ – రీకాల్ కాన్సెప్ట్ మీద తీసిన పవర్ ఫుల్ అండ్ పర్పస్ ఫుల్ ఫిలిమ్ ఓటర్

Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Voter Movie Public Talk, Voter Movie Review, Voter Movie Review And Ratings, Voter Movie Story, Voter Review, Voter Telugu Movie Live Updates, Voter Telugu Movie Public Response, Voter Telugu Movie Review
Voter Telugu Movie Review

ఒకప్పుడు సమకాలిన రాజకీయ పరిస్థితులను విమర్శిస్తూ, విశ్లేషిస్తూ, ప్రశ్నిస్తూ సినిమాలు విరివిగా వచ్చేవి. ఇప్పుడు అలాంటి రాజకీయ చిత్రాలు రావటం బాగా తగ్గింది. ఒకటీ అరా వచ్చినా వాటిలో రాజకీయ చైతన్య స్ఫూర్తి ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. కమర్షియల్ వ్యాల్యూస్ పేరుతో రాజకీయ చిత్రాల్లో కూడా హంగు ఆర్బాటాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు( జూన్ 21) మంచు విష్ణు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజకీయ నేపథ్య చిత్రం” ఓటర్” ఎలా ఉందో చూద్దాం.

గౌతమ్( విష్ణు) ఒక ఎన్నారై. లక్షల్లో జీతం, అందమైన జీవితం… మంచి ఫ్రెండ్స్- అన్నీ ఉన్న గౌతమ్  ఒక అమ్మాయి( సురభి) ని ప్రేమిస్తాడు. అయితే అతని ప్రేమలోని సిన్సియారిటీకి ఆమె ఒక పరీక్ష పెడుతుంది. ఎలక్షన్స్ లో  పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి( పోసాని కృష్ణ మురళి) ప్రజలకు చేస్తున్న వాగ్దానాలను వింటూ ‘ఆ రాజకీయ నాయకులు చేసే వాగ్దానాలకు మీ ప్రేమికులు చేసే ప్రామిస్ లకు తేడా ఉండదు… ఓట్లు దండుకుని పదవులు వచ్చాక వాళ్లు చేసిన వాగ్దానాలు మర్చిపోతారు… అమ్మాయిలు ప్రేమలో పడ్డాక కుర్రాళ్ళు చేసిన ప్రామిసులు మర్చిపోతారు..  నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఆ ఎమ్మెల్యే చేస్తున్న వాగ్దానాలన్నీ నెరవేర్చేలాగా చెయ్యి … అప్పుడు నీది నిజమైన ప్రేమ అని ఒప్పుకుంటాను.. నీ ప్రేమను అంగీకరిస్తాను.. అని లింకు పెడుతుంది. సరదాగా ప్రారంభమైన వాళ్ల ప్రేమ పందెం సీరియస్ గా మారుతుంది. ఆ ఛాలెంజ్ కి అంగీకరించిన గౌతమ్ ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేస్తూ అతని చేత  మంచి పనులు చేయిస్తుంటాడు. ఈ ప్రాసెస్ లోనే అనుకోకుండా గౌతమ్ కు  మంత్రి శ్రీపతి( సంపత్) కు మధ్య వైరం ఏర్పడుతుంది. పేదవాళ్లకు ఇచ్చిన పట్టా భూములను ఆక్రమించి వాణిజ్య సముదాయాలు కట్టటానికి దౌర్జన్యం చేస్తున్న మంత్రి శ్రీపతిని రీకాల్ చేయవలసిందిగా సోషల్ మీడియా ద్వారా ఉద్యమం లేవదీస్తాడు గౌతమ్. చిలికి చిలికి గాలివానగా మారిన ఆ ఉద్యమం జాతీయస్థాయిలో సంచలనం సృష్టించి దేశంలోనే మొట్టమొదటి “రీ కాల్ ఎలక్షన్” కు దారితీస్తుంది.

అసలు రీ కాల్ అంటే ఏమిటి? రీ కాల్ ద్వారా ఎన్నుకోబడిన శాసన సభ్యుడిని గాని, పార్లమెంటు సభ్యుడి గానీ పదవి నుండి తొలగించే అవకాశంగా ఉందా? ఉంటే అది ప్రాక్టికల్ గా ఎలా సాధ్యం? అసలు “ఓటర్” అనేవాడికి ఉన్న హక్కు ఏమిటి? అతని శక్తి ఏమిటి? ఇత్యాది విషయాల celluloid డిబేట్ గా నడుస్తుంది ఈ చిత్ర  ద్వితీయార్థం.

ప్రేమకు- రాజకీయాలకు మధ్య చిన్న లింకు పెట్టి చిత్ర కథను ఆ వైపు డైవర్ట్ చేయడం కొంచెం కొత్తగా ఉన్నప్పటికీ కన్విన్సింగ్ గానే అనిపించింది. ప్రతి రాజకీయ చిత్రంలోనూ హీరోకు – విలన్ కు మధ్య జరిగే వాదోపవాదాలు, ఎత్తులకు పై ఎత్తులు, సవాళ్లు ప్రతిసవాళ్లు , అరుపులు చరుపులు ఇందులో కూడా ఉన్నప్పటికీ రాజకీయపరమైన అవగాహన, చర్చ, పరిశీలన, రీ కాల్ అనే కొత్త కాన్సెప్ట్ తాలూకు ఎవేర్నేస్ ను దర్శకుడు కార్తీక్ రెడ్డి సమర్ధవంతంగా ఆవిష్కరించగలిగాడు. ఇలాంటి రాజకీయ చైతన్య చిత్రాలకు  రచన దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు దర్శకుడికి ఉండవలసిన సామాజిక స్పృహ, రాజకీయ అవగాహన ,  వాటిని సెల్యులాయిడ్ కు మలచుకునే క్రియేటివిటీ కార్తీక్ రెడ్డిలో బాగానే ఉన్నాయి అనిపించింది. ముఖ్యంగా డైలాగ్ రైటర్ గా కార్తీక్ రెడ్డి లో మంచి పరిణితి కనిపించింది. సాక్షి టీవీ ఇంటర్వ్యూలో, ఆ పై స్టూడెంట్స్ తో జరిగే ఇంటరాక్షన్ సన్నివేశంలో కార్తీక రెడ్డి రాసుకున్న డైలాగులు అర్థవంతంగా, ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.

నటీనటుల పెర్ఫార్మెన్స్: 

ఇందులో తెరమీద నోట్ వర్దీ గా కనిపించే పాత్రలు నాలుగు. హీరో గౌతమ్, మంత్రి శ్రీపతి, ఎమ్మెల్యే, రిక్షావాడు. హీరో గౌతమ్ పాత్రలో మంచు విష్ణు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లవర్ బాయ్ గా, యాక్షన్ హీరోగా, ప్రస్టేటెడ్ యూత్ గా,  రివోల్టింగ్ లీడర్ గా డిఫరెంట్ షేడ్స్ ఉన్న గౌతమ్ పాత్రలో మంచు విష్ణు డిఫరెంట్ డైమన్షన్స్ ప్రదర్శించగలిగాడు. ఇక మంత్రి శ్రీపతి పాత్రలో సంపత్ చక్కగా నటించాడు. అమాయక ఎమ్మెల్యేగా పోసాని కృష్ణ మురళి తనదైన శైలిలో అలరించాడు. రౌడీలకు భయపడి ఓటు వేయటానికి బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండిపోయిన బస్తీ జనాన్ని ఉత్తేజపరిచే రిక్షావోడు పాత్రలో ప్రముఖ నటుడు ఎల్బి శ్రీరామ్ సింప్లీ సూపర్బ్ అనిపించాడు. ఇక హీరోయిన్ సురభితో పాటు మిగిలినవన్నీ కం అండ్ గో పాత్రలే.

తమన్ మ్యూజిక్ తో పాటు మిగిలిన టెక్నికల్ అంశాలు, నిర్మాతల మేకింగ్ స్టాండర్డ్స్ అన్నీ సమపాళ్లలో కుదిరిన కాంటెంపరరీ పొలిటికల్ యటెంప్ట్ ఓటర్.

ప్లస్ పాయింట్స్: 

*రీకాల్ అనే కొత్త పాయింట్
*  డైరెక్షన్ అండ్ డైలాగ్స్
*మంచు విష్ణు పర్ఫార్మెన్స్
* మేకింగ్ వాల్యూస్

మైనస్ పాయింట్స్:

*సెకండ్ హాఫ్ లో కొంత సాగతీత
*కొన్ని రొటీన్ సీన్స్

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

 

ఓటర్ తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • ScreenPlay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here