ఫస్ట్ ర్యాంక్ రాజు తెలుగు మూవీ రివ్యూ

First Rank Raju Movie Mouth Talk, First Rank Raju Movie Public Talk, First Rank Raju Movie Review, First Rank Raju Movie Review And Ratings, First Rank Raju Movie Story, First Rank Raju Review, First Rank Raju Telugu Movie Live Updates, First Rank Raju Telugu Movie Public Response, First Rank Raju Telugu Movie Review, Latest telugu movie reviews, latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
First Rank Raju Telugu Movie Review

కన్నడలో సూపర్ హిట్ అయిన ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాకు రీమేక్ గా తెలుగులో కూడా అదే పేరుతో అదే డైరెక్టర్ నరేష్ కుమార్ దర్శకత్వంలో చేతన్ మద్దినేని ప్రధాన పాత్రలో ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకూ అలరించిందో తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు: చేతన్‌ మద్దినేని, కశిష్‌ ఓరా, నరేష్‌, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి, అమిత్‌, నవీన్‌, భద్రం, గుండు సుదర్శన్‌, నాగినీడు, రాజేశ్వరి నాయర్‌ తదితరులు
రచన, దర్శకత్వం: నరేష్‌కుమార్‌ హెచ్‌.ఎన్‌
బ్యానర్: డాల్ఫిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
నిర్మాత: మంజునాథ్‌ వి.కందుకూర్‌
సంగీతం: కిరణ్‌ రవీంద్రనాథ్‌
బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: జె.బి.
సినిమాటోగ్రఫీ: శేఖర్‌ చంద్ర

కథ:

శోభన్ రాజు (నరేష్) కొడుకు రాజు (చేతన్ మద్దినేని). చిన్నప్పటి నుండి రాజు తన తండ్రి చెప్పినట్టే బయటి విషయాల గురించి అస్సలు పట్టించుకోకుండా కేవలం చదువు మీద మాత్రమే శ్రద్ద పెట్టి స్కూల్ లో కాలేజ్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. అయితే ప్రపంచ జ్ఞానంలో మాత్రం సున్నా. కనీసం బయటకు వెళ్లి కూరగాయలు కూడా సరిగా తేలేని తెలివితక్కువాడు. అలాంటి రాజు చదువు అయిపోయిన తరువాత ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లగా అతనికి ఫస్ట్ ర్యాంక్ ఉన్నా లోక జ్ఞానం లేకపోవడంతో ఉద్యోగం రాదు. దీంతో మనస్థాపానికి గురైన రాజు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. వెంటనే కొడుకుని తీసుకొని ఆ కంపెనీ ఎం.డి. దగ్గరకు వెళ్లి తన కొడుకుని చదువులోనే కాదు, మిగతా విషయాల్లోనూ నెంబర్‌ వన్‌గా చేసి తీసుకొస్తానని ఛాలెంజ్‌ చేస్తాడు. మరి రాజు మళ్లీ తన తండ్రి చెప్పిన బాటలో నడుస్తాడా..? నరేష్ రాజు ను మామూలు అబ్బాయిగా తయారుచేయగలుగుతాడా? ఛాలెంజ్ లో గెలుస్తాడా..? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

విశ్లేషణ:

నిజానికి డైరెక్టర్ తీసుకున్న పాయింట్ చాలా మంచిది. పిల్లలకు.. తల్లిదండ్రులకు మధ్య ఉండాల్సిన అవగాహన గురించి చెప్పే ప్రయత్నం చేశారు. పిల్లల ఆలోచనలు ఎలా ఉన్నాయి.. వారు ఎలా ఆలోచిస్తున్నారు.. జీవితంలో వాళ్లు ఏం సాధించాలనుకుంటున్నాడు? ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారు? వాళ్లఇంట్రెస్ట్‌ దేని మీద ఉంది? ఇలా ఆలోచించే తల్లిదండ్రులు చాలా తక్కువ. అలాంటి తల్లిదండ్రుల కోసమే రూపొందిన సినిమా ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’. ఆ విషయాలను ఈ సినిమా ద్వారా తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఇక ఎలాగూ కన్నడలో తానే తీశాడు కాబట్టి తెలుగులో కూడా తన టేకింగ్ తో మంచి మార్కులు కొట్టేశాడు.

ఇక హీరోగా నటించిన చేతన్‌ మద్దినేని తన పాత్రకు తగ్గట్లు లుక్స్ అండ్ నటన పరంగా కూడా ఆకట్టుకున్నాడు. అమాయకమైన పాత్రలో.. ఓ దద్ది క్యారెక్టర్లో చాలా బాగా నటించాడు. తాను తప్ప ఈ పాత్రను అంతలా ఎవరూ చేసేవారు కాదేమో. తన పనులతో నవ్వించమే కాకుండా.. ఆత్మహత్య చేసుకునే సన్నివేశంలో, ఆలాగే ప్రీ క్లైమాక్స్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ లో చేతన్‌ చాలా బాగా నటించాడు. హీరోకి తండ్రిగా శోభన్‌బాబు పాత్రలో నరేష్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక కాలేజ్‌ స్టూడెంట్స్‌గా ప్రియదర్శి, అమిత్‌, నవీన్‌.. రాజు ప్రవర్తనకు ఎప్పుడూ షాక్‌ అయ్యే ప్రిన్సిపాల్‌ పాత్రలో పోసాని.. ఇలా వారి పాత్రలకు వారు న్యాయం చేశారు. రాజుకు జీవితం పట్ల అవగాహన కల్పించే పాత్రలో ప్రకాష్‌రాజ్‌ ఎప్పటిలాగే తన నటనతో ఇన్‌స్పైర్‌ చేశారు. వెన్నెల కిశోర్ ఎప్పటిలాగే తమకు మాత్రమే సాధ్యమైన కామెడీ ఎక్స్ ప్రెషన్స్ , తమ శైలి మాడ్యులేషన్స్ తో బాలీవుడ్‌ బాబి పాత్రతో నవ్వించాడు. ఇక హీరోయిన్ గా నటించిన కౌశిక్‌ ఓరా బాగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అతిథి పాత్రల్లో బ్రహ్మానందం, రావు రమేష్‌ ఆకట్టుకున్నారు.

అయితే సెకండాఫ్‌లో హీరోను మౌల్డ్‌ చేసే సన్నివేశాలు రిపీట్‌ అవుతున్న ఫీలింగ్‌ కనిపిస్తుంది. వాటిని కాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది. అయ్యర్‌ శ్రవణ్‌ రాసిన మాటలు చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లోని డైలాగ్స్‌ ఆడియన్స్‌ని ఆలోచింపజేస్తాయి.

ఇక సంగీత దర్శకుడు కిరణ్ రవీంద్రనాధ్ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో నేపధ్య సంగీతం బాగుంది. ఎడిటర్ పనితనం కూడా ఆకట్టుకుంది. మంజునాధ్‌ వి. కందుకూర్‌ నిర్మాణ విలువులు బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ప్రతి స్టూడెంట్‌, పేరెంట్స్‌ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’.

 

ఫస్ట్ ర్యాంక్ రాజు తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • ScreenPlay
  • Direction
  • Performance
3.2
Sending
User Review
0 (0 votes)

[subscribe]

[youtube_video videoid=Aoe_oWBUJ3o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =