విజయ్ కోసం దుల్కర్ పాట

2019 Latest Telugu Movie News, Dulquer Salmaan Croons For Vijay Deverakonda,Dulquer Salmaan croons a song in Dear Comrade, , Dulquer Salmaan Song for Vijay Devarakonda, Dear Comrade movie updates, Dear Comrade movie latest news, actor Vijay Deverakonda Dear Comrade movie latest updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Dear Comrade movie songs, Dear Comrade telugu movie songs
Dulquer Salmaan Croons For Vijay Deverakonda

గీత గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో… స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో.. వినూత్నకథ తో తెరకెక్కుతున్న ఈసినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తి అయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జులై 26 వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను.. పాటలను రిలీజ్ చేస్తూ బజ్ పెంచుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకొచ్చింది. డియర్ కామ్రేడ్ సినిమాను తెలుగు, తమిళ్ తో పాటు కన్నడ, మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి కదా. అయితే మలయాళం వర్షన్ లో విజయ్ కోసం దుల్కర్ ఓ పాటను పాడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రికార్డింగ్ నిన్న జరిగిందట. ఈనేపథ్యంలోనే దుల్కర్ పాడిన పాట కూడా బాగా వచ్చినట్టు తెలుస్తోంది.

మరి దుల్కర్ మంచి నటుడే కాదు.. మంచి సింగర్ కూడా. ఏబీసీడీ, సీఐఏ, చార్లీ సినిమాల్లో కూడా తాను పాడాడు. ఇక విజయ్, దుల్కర్ కలిసి మహానటి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

కాగా లవ్‌ ఎంటర్‌ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను బిగ్‌బెన్‌ సినిమా, మైత్రీ మూవీమేకర్స్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాకినాడ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తున్న విజయ్ దేవరకొండ కాకినాడ యాసలో అలరించనున్నాడు. రష్మిక మందనా మహిళా క్రికెటర్‌గా కనిపిస్తోంది. మరి గీతగోవిందం సినిమాతో హిట్ కొట్టిన.. ఈ హిట్ కాంబో.. డియర్ కామ్రెడ్ సినిమాతో హిట్ అందుకుంటుందో.. లేదో.. చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=n3AqEHg6ofI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 11 =