‘రణరంగం’ నుండి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్

Ranarangam Team Wishes Kajal Aggarwal On Her Birthday ,2019 Latest Telugu Movie News,Kajal First Look From Ranarangam Movie,Kajal Aggarwal New Look From Ranarangam,First Look of Kajal Aggarwal in Ranarangam,Ranarangam Movie Latest Updates,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News
Kajal First look From Ranarangam movie

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చందమామ కాజల్ అగర్వాల్.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దిరోజులకే మంచి గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఎంతో మంది యంగ్, సీనియర్ హీరోలతో పనిచేసిన ఈ భామ.. ఇండస్రీలోకి అడుగుపెట్టిన 12 ఏళ్లలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవలే సీత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అది నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు తాజాగా ‘రణరంగం’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ‘రణరంగం’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శర్వానంద్ కూ జోడీగా కాజల్ కనిపించనుంది. ఇక ఈ రోజు కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ పోస్టర్ ను దర్శకుడు సుధీర్ వర్మ రిలీజ్ చేశాడు. సంతోషంతో బీచ్ లో ఆడిపాడుతున్నట్టుగా ఆమె ఈ పోస్టర్లో కనిపిస్తోంది. కాజల్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరెన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలు ఆమె చేయాలని సుధీర్ వర్మ వ్యక్తం చేశాడు.

ఈ సినిమాతో పాటు కాజల్ హిందీ చిత్రం “క్వీన్” రీమేక్, జయం రవి హీరోగా వస్తున్న తమిళ చిత్రం “కోమలి” మూవీలో నటిస్తున్నారు.

                                                                                [subscribe]

[youtube_video videoid= EQXx18Pd6hA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =