ఆర్ఆర్ఆర్ టైటిల్ రివీల్ కూడా ఆరోజేనా..!

2019 Latest Telugu Movie News, RRR Movie Latest Updates, RRR Movie Title Details, RRR Movie Title News, RRR Movie Title Release Date, RRR Movie Title Revealed on That Day, RRR Movie Title To Be Unveiled On A Special Day, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
RRR Movie Title To Be Unveiled On A Special Day

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాపై అప్పట్లో రాజమౌళి ప్రెస్ మీట్ కొన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చారు. అయితే ఎంత క్లారిటీ ఇచ్చినా ఏదో ఒక కొత్త వార్త బయటకు వస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ ను స్వాతంత్య్ర దినోత్సవం ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు టైటిల్ రివీల్ పై కూడా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఫస్ట్ లుక్ తోపాటు టైటిల్ ను కూడా అదే రోజు రివీల్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ లో నటిస్తున్నాడు. చెర్రీ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఎన్టీఆర్ హీరోయిన్ కోసం చిత్రయూనిట్ అన్వేషణలో ఉంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వ‌చ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయనున్నారు.

[subscribe]

[youtube_video videoid=0XwacVaiMO0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 4 =