1000 గుండెలకు ప్రాణం పోసిన సూపర్ స్టార్

2019 Latest Telugu Movie News,Mahesh Babu Kind Gesture Unveiled Again, 1000 Hearts rescued by mahesh babu, mahesh babu helps 1000 children suffering from heart diseases,Mahesh Landmark Social Service,Mahesh Babu Greatness,Mahesh Babu Helping 1000 Childrens,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Mahesh Babu Kind Gesture Unveiled Again

కుడి చేతితో చేసే సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదనే సామెతను ఎవరి పాటించినా పాటించకపోయినా… సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం తప్పకుండా పాటిస్తాడు. అందుకే తాను ఎన్నో సేవా వా కార్యక్రమాలు చేసినా పెద్దగా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడడు. ఇప్పటికే మహేష్ చిన్న పిల్లలకు పలు సేవా కార్యక్రమాలు అందించడంతో పాటు.. పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు మహేష్ చేసిన మరో గొప్ప పని వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేయి గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. తాజాగా మహేష్ సతీమణి నమ్రత ఈ ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

గత మూడేళ్ళ కాలంలో మహేష్ బాబు 1000 మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలని విజయవంతగా చేయించాడు. ఆంధ్ర హాస్పిటల్స్, ఇంగ్లాండ్ కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండషన్ సంస్థల సహకారంతో మహేష్ బాబు ఈ అద్భుత కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు నమ్రత తెలిపింది. మంచి కార్యక్రమానికి తనవంతు సహకారం అందించిన డాక్టర్ పీవీ రామారావుకు నమ్రత ధన్యవాదాలు తెలిపింది. ఆయన వైద్య బృదం కూడా ఎంతో గొప్పగా సహకరించారని పేర్కొంది. దీంతో నిజంగానే మహేష్ ఎంతో గొప్ప పనిచేశాడు అని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి నమ్రత సోషల్ మీడియాలో ఈ విషయం పంచుకుంది కాబట్టి తెలిసింది… లేకపోతే చాలామందికి తెలియకపోయేది. అయితే చెడ్డ విషయాలు తెలియకపోయినా పర్వాలేదు కానీ.. ఇలాంటి మంచి విషయాలు మాత్రం బయటకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

[subscribe]

[youtube_video videoid=rDoFiOjoC2Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + eight =