కన్నడలో సూపర్ హిట్ అయిన ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మాతృక డైరెక్టర్ నరేష్ కుమార్ దర్శకత్వంలోనే తెలుగులో కూడా అదే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సినిమా రీలిజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను, ట్రైలర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా చేతన్ మద్దినేని ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాలో కషిష్ వొహ్రా, ప్రకాష్ రాజ్, ప్రియదర్శి, బ్రహ్మానందం, రావు రమేష్, నరేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డాల్ఫిన్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై మంజునాథ్ వి కందుకూర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. కిరణ్ రవింద్ర నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి కన్నడంలో మంచి హిట్ అయిన్ ఈ సినిమా ఇక్కడ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో తెలియాలంటే రిలీజ్ అయ్యేంతవరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=Aoe_oWBUJ3o]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: