కలెక్షన్ కింగ్ పై సూర్య ప్రశంసలు

2019 Latest TeluguMovie News, Mohan Babu Next in Suriya New Movie, Mohan Babu To Team Up For Suriya Next Film, Suriya Hails Dialogue King Mohan Babu, Suriya Praises Dialogue King Mohan Babu, Suriya To Work With Mohan Babu in Soorarail Pottru Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Suriya Hails Dialogue King Mohan Babu

సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో “సోరారై పోట్రు” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా నటిస్తున్నాడు. ఎన్నో ఏళ్ల తరువాత మోహన్ బాబు తమిళ సినిమాలో నటిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే చెన్నైలో జరిగిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ లో ఈ ఇద్దరు నటులు కలిసి నటించారు. ఈ సందర్భంగా సూర్య తన ట్విట్టర్ ద్వారా మోహన్ బాబుపై ప్రశంసలు కురిపిస్తూ ఓ ట్వీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“నిబద్దత,క్రమశిక్షణ కలిగిన గొప్ప నటుడు మోహన్ బాబు గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది,500 సినిమాల ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానం స్పూర్తిదాయకం, “సోరారై పోట్రు” చిత్రంలో నటిస్తున్నందుకు ధన్యవాదాలు” అని సూర్య ట్విట్టర్ లో ఆయనతో తన వర్కింగ్ ఎక్సపీరియెన్స్ ని పంచుకున్నారు.

మరి విలన్ పాత్రలు మోహన్ బాబుకు కొత్తేమి కాదు. తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చినా… ఆ తరువాత విలన్ గా కూడా చాలా సినిమాల్లో నటించి తనలోని విలనిజాన్ని చూపించాడు. ఇప్పుడు ఎన్నో ఏళ్ల తర్వాత విలన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్న మోహన్ బాబు ఈ సినిమాతో ఎలాంటి విలనిజాన్ని చూపెడతాడో చూడాలి.

[subscribe]
[youtube_video videoid=b8LcGVFcZzs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 3 =