‘వి’ స్టోరీ లైన్ అదేనా?

2019 Latest TeluguMovie News, Nani and Sudheer Babu New Movie Story Revealed, Nani and Sudheer Babu V Movie Story Revealed, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, V Movie Latest Updates, V Movie Shooting Updates, V Movie Story
Nani and Sudheer Babu V Movie Story Revealed

ఈ వేస‌వికి విడుద‌లైన‌ ‘జెర్సీ’తో మంచి విజయాన్ని అందుకున్న నేచురల్ స్టార్ నాని… ప్ర‌స్తుతం రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక‌ వైపు టాలెంటెడ్‌ డైరెక్టర్ విక్రమ్ కుమార్ రూపొందిస్తున్న‌ ‘గ్యాంగ్‌లీడర్’లో నటిస్తూనే… మ‌రోవైపు సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వి’ చిత్రంలో కూడా న‌టిస్తున్నాడు నాని. కాగా… ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న ‘వి’ చిత్రానికి సంబంధించి… ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశం టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే… క్రైమ్ థిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నాని వరుస హత్యలను చేసి క్లూస్ కూడా వదిలేస్తుంటాడ‌ట‌. ఈ నేప‌థ్యంలో ఆ కేసును డీల్ చేయ‌డానికి వ‌చ్చిన స్పెష‌ల్ ఆఫీస‌ర్ సుధీర్ బాబు… ఆ మిస్ట‌రీని ఎలా ఛేదించాడు? అనే కథాంశంతో `వి` సినిమా తెరకెక్కుతోందని టాలీవుడ్ టాక్. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అదితిరావ్‌ హైదరి, నివేదా థామస్ కథానాయికలుగా న‌టిస్తున్నారు. ఈ సంవ‌త్స‌రాంతంలో `వి` ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=7dZqS3JIQ1I]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =