పాత‌బ‌స్తీలో ‘డిస్కో రాజా’ సంద‌డి

2019 Latest Telugu Movie News,Disco Raja Movie Shooting in Old City, Ravi Teja Disco Raja movie shooting Details, Disco raja Telugu Movie, Ravi Teja upcoming movie updates, ravi teja Next latest movies, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Disco Raja Movie Shooting in Old City

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘డిస్కో రాజా’. రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. యువ సంగీత సంచ‌ల‌నం ఎస్.ఎస్.తమన్ బాణీలు అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ … ఇప్ప‌టికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. మే 27 నుంచి ప్రారంభమైన రెండో షెడ్యూల్‌లో భాగంగా… ఆ మ‌ధ్య‌ రామోజీ ఫిలిం సిటీలో రవితేజ, ‘వెన్నెల’ కిషోర్ కాంబినేష‌న్‌లో కొన్ని కామెడీ సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. అంతేకాదు, తాజాగా హైదరాబాద్‌లోని పాత బస్తీలో వేసిన ఓ స్పెష‌ల్‌ సెట్‌లో రవితేజతో పాటు ఇతర ప్ర‌ధాన‌ తారాగణంపై కొన్ని ముఖ్య ఘ‌ట్టాల‌ను కూడా తెరకెక్కించారట. దీంతో ఈ సినిమాకి సంబంధించిన‌ మేజర్ పార్ట్ పూర్తయినట్టు తెలుస్తోంది.

కాగా… ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నఈ చిత్రం… ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=otdGhg81P4M]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 4 =