‘ఆర్ఆర్ఆర్‌’… ఓవ‌ర్సీస్ బిజినెస్ అదుర్స్‌

RRR Movie Overseas Business Details,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RRR Movie Latest Updates,RRR Telugu Movie News,RRR Movie Business Details,#RRR
RRR Movie Overseas Business Details

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి రూపొందిస్తున్న మాసివ్ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత డీవీవీ దాన‌య్య… దాదాపు రూ.350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ న‌టులు అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓవ‌ర్సీస్ బిజినెస్ వ్య‌వ‌హారాలు పూర్త‌య్యాయ‌ని తెలిసింది. దుబాయ్‌కి చెందిన ఓ ప్ర‌ముఖ పంపిణీదారుడు ఈ చిత్రం తాలూకు ఓవ‌ర్సీస్ రైట్స్‌ను రూ.65 కోట్ల‌కు సింగిల్ పేమెంట్ డీల్‌తో పొందార‌ని… చైనాలో త‌ప్ప మిగిలిన అన్ని దేశాల్లోనూ, అన్ని భాష‌ల్లోనూ రిలీజ్ చేసేలా ఈ ఓవ‌ర్సీస్ రైట్స్‌ను ఆయ‌న సొంతం చేసుకున్నార‌ని ట్రేడ్ టాక్‌. నిర్మాణ ద‌శ‌లో ఉండ‌గానే `ఆర్ ఆర్ ఆర్‌` ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ స్థాయిలో జ‌రుగుతుండ‌డ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. ఏదేమైనా… ఓవ‌ర్సీస్ రైట్స్ ప‌రంగా `ఆర్ ఆర్ ఆర్‌` స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింద‌నే చెప్పాలి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావచ్చు. కాగా, `ఆర్ ఆర్ ఆర్‌` వ‌చ్చే ఏడాది జూలై 30న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది.

[subscribe]

[youtube_video videoid=DP4qQX1PxLs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 20 =