‘ఎన్టీఆర్’ బయోపిక్ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మొదట బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలు వచ్చినా.. ఆ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. ఆ తరువాత ‘జైసింహా’ సినిమాతో బాలకృష్ణకు హిట్ ఇచ్చిన కేఎస్ రవికుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ సినిమా కూడా లేదన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలన్నింటికి బ్రేక్ పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్‌నివ్వగా.. బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. జులై నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ కనిపించనున్నాడట. మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమాకి ‘క్రాంతి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
కాగా హ్యాపీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈసినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, కళ: చిన్నా, మాటలు: రత్నం. మరి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జై సింహా’ మంచి విజయాన్ని సాధించింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూద్దాం..
[youtube_video videoid=rDoFiOjoC2Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: