విజువల్ ట్రీట్ సాహో టీజర్ రిలీజ్

Saaho Teaser,Saaho Movie Teaser,Saaho Official Teaser,Saaho Telugu Movie Teaser,Saaho Telugu Teaser,Saaho Teaser 2019,Saaho Movie 2019,Saaho New Teaser,Telugu New Teasers 2019,Saaho Movie Latest Teaser,Prabhas Saaho Teaser,Saaho Teaser Day,Saaho Movie Updates,#SaahoTeaser,#SaahoTeaserDay
Saaho Teaser to be a Visual Treat

సాహో.. సాహో.. సాహో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే వినిపిస్తుంది ప్రస్తుతం. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు మేకింగ్ వీడియోలతో సాహోపై అంచనాలను పెంచేశారు చిత్రయూనిట్. అప్పుడప్పుడు ఈ సినిమా నుండి పోస్టర్లు విడుదల చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. అయితే ఎప్పుడైతే టీజర్ అప్ డేట్ ఇచ్చారో ఆ రోజు నుండి ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో చేసిన స్టంట్స్ ఎప్పుడు చూస్తామా అని టీజర్ కోసం చూస్తున్నారు. ఇక వారి ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాధ అయినా హ్యాపీ అయినా పంచుకోవడానికి ఎవరూ లేరూ అని శ్రద్ధా కపూర్ అనగా.. నేను ఉన్నానని ప్రభాస్ అన్న డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ఇక టీజర్ ను చూస్తే సుజిత్ ను నమ్మి ఇంత బడ్జెట్ ఎలా పెట్టారా అన్న ప్రశ్నకు సమాధానం దొరికినట్టుంది. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెప్పినట్టే కేవలం రెండు డైలాగ్స్ మాత్రమే టీజర్లో చూపించారు. మొత్తం యాక్షన్ సీన్సే ఉన్నాయ్. యాక్షన్ సీన్స్ అయితే హాలీవుడ్ రేంజ్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయని చెప్పొచ్చు. హాలీవుడ్ రేంజ్ యాక్ష‌న్ స్టాండ‌ర్డ్స్ ను చూపించారు. మధ్యలో వీళ్లేవరూ అని శ్రద్ధా కపూర్ అనగా.. ఫ్యాన్స్ అని ప్రభాస్ అనగా.. దానికి వీళ్లేంటి ఇంత వైలెంట్ గా ఉన్నారని శ్రద్దా అంటే.. డై హార్డ్ ఫ్యాన్స్ అని ప్రభాస్ సీరియస్ గా కామెడీ చేయడం బావుంది. మొత్తానికి ప్రభాస్ సుజిత్ పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్టే అనిపిస్తుంది. ఈ టాలీవుడ్ బాహుబలితో సుజిత్ రికార్డులు సృష్టించేలా ఉన్నాడు.

కాగా సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తోంది. ఇంకా ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, ఎవిలిన్ శర్మ, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగష్టు 15న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=rDoFiOjoC2Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =