సాహో టీజర్ కౌంట్ డౌన్ స్టార్ట్

Saaho Teaser Countdown Begins,Telugu Filmnagar,Telugu Film Updtaes,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Saaho Teaser Latest Updates,Saaho Teaser,Saaho Movie Teaser Countdown Starts,Prabhas Saaho Movie Latets Updates,Countdown Begins For Saaho Teaser
Saaho Teaser Countdown Begins

ప్రభాస్ అభిమానులు ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో టీజర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడు టీజర్ రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు ప్రభాస్ ను.. యాక్షన్ సీన్స్ ను చూసేద్దామా అని అటు ప్రభాస్ అభిమానులతో పాటు.. ప్రతి సినీ అభిమాని కూడా ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా… నిన్న రాత్రి విడుదల చేసిన పోస్టర్ తో ఆ అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటివరకూ వచ్చిన పోస్టర్ లలో మాత్రం ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. బైక్ పై ప్రభాస్ విధ్వంసం సృష్టిస్తూ కనిపిస్తున్నాడు. ప్రభాస్ బైక్ పై దూసుకొస్తుంటే బ్యాక్ గ్రౌండ్ లో కారులు పేలుతూ గాల్లోకి ఎగిరిపడుతున్న ఈ దృశ్యం అద్భుతంగా ఉంది. దీంతో ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో అర్ధమవుతోంది. ఒక్క పోస్టర్ తో సాహో చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ రోజు ఉదయం 11:23 గంటలకు టీజర్ విడుదల కానున్న నేపథ్యంలో.. ప్రభాస్ టీజర్లో ఎంత విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.

ఇండియన్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. యువీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తోంది. బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇంకా… నీల్ నితిన్ ముఖేష్, ఎవిలిన్ శర్మ, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగష్టు 15న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=Z6WlMvYEc3Q]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 10 =