న్యాచురల్ స్టార్ – బ్యాక్ టు షూట్

Natural Star Nani Back To Shoot Again,Telugu Filmnagar,Telugu Film Udates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Natural Star Nani New Movie Shoot,Actor Nani Back To Shoot Again,Nani Upcoming Film Shooting,Nani New Movies Shooting Schedule Updates
Natural Star Nani Back To Shoot Again

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. ఇక ఆ సినిమా తరువాత వెంటనే నాని గ్యాప్ కూడా తీసుకోకుండా.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ ను ట్రాక్ లో పెట్టేశాడు. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైపోయింది కూడా. అయితే షూటింగ్ సమయంలో నాని కాలికి గాయమవడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజా సమాచారం ప్రకారం… నాని మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. డాక్టర్స్ ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చినా కూడా నాని మాత్రం మూడు రోజులు మాత్రమే రెస్ట్ తీసుకొని మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది.

కాగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కూడా నెగెటివ్ షేడ్ ఉన్న ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నానికి జోడిగా ప్రియాంక నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫిగా పీసీ శ్రీరామ్ పనిచేస్తున్నాడు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. మరి జెర్సీ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన నానికి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం..

[subscribe]
[youtube_video videoid=1kJSL8cYbyU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − twelve =