ఒక షెడ్యూల్ మిన‌హా ‘మన్మథుడు 2’ పూర్తి

Manmadhudu 2 Movie Shoot Nearing Completion,Telugu Filmnagar,Telugu Film Udates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manmadhudu 2 Movie Shoot,Manmadhudu 2 Movie Shooting Wraps Up,Manmadhudu 2 Movie Latest Updates,Manmadhudu 2 Movie Shooting Schedule
Manmadhudu 2 Movie Shoot Nearing Completion

“అమ్మాయి లార్డ్‌లా కూర్చుంటే… మనం కూలోడి లాగా వంగి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు ముళ్ళు వెయ్యాలి. ఇక్కడినుంచే బెండింగ్ స్టార్ట్ అయిపోయింది బ్రదరూ” అంటూ అమ్మాయిల విషయంలో, పెళ్లి విషయంలో యువకులను జాగృతం చేసిన ‘మన్మథుడు’ అభిరామ్‌ను తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మరచిపోలేరు. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా కొత్త కాన్సెప్ట్‌తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధపడుతున్నాడు ‘మన్మథుడు 2’.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కింగ్ నాగార్జున, స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మన్మథుడు 2’. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం… ఒక షెడ్యూల్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తిచేసుకున్న‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉంటే… ‘మన్మథుడు 2’ టీజ‌ర్‌ను రేపు (జూన్ 13న) విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. సమంత, కీర్తి సురేష్ అతిథులుగా క‌నిపించ‌నున్న ఈ సినిమాలో… లక్ష్మి, రావు రమేష్, ‘వెన్నెల’ కిషోర్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

ఛైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని… నాగార్జున‌, పి.కిర‌ణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా… ఆగస్టు నెలలో ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

[subscribe]

[youtube_video videoid=ruEcJyx3c3M]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 5 =