మరో స్పెష‌ల్ సాంగ్‌లో కాజల్ అగ‌ర్వాల్?

Kajal Aggarwal In Another Special Song?,Telugu Filmnagar,Telugu Film Udates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kajal Aggarwal Next in Allu Arjun Movie,Kajal To Do Special Song in #AA19,#AA19 Movie Updates,Allu Arjun and Trivikram New Movie Special Song by Kajal,Kajal Agarwal Another Item Song For Allu Arjun
Kajal Aggarwal In Another Special Song?

యంగ్ టైగర్ యన్టీఆర్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ గా నిల‌చిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఆ సినిమాలో “నేను పక్కా లోకల్” అనే స్పెష‌ల్‌ సాంగ్ ఎంతగా పాపులర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దానికి కారణం… టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తొలిసారి ప్ర‌త్యేక గీతంలో నర్తించిన కాజల్… ధియేటర్ల‌లో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. క‌ట్ చేస్తే… మూడేళ్ళ త‌రువాత మరోసారి తన స్టెప్స్‌తో మాస్ ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధపడుతోందట ఈ భామ‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేక‌ర్‌ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలోని ఓ స్పెష‌ల్‌ సాంగ్ కోసం కాజల్ అగర్వాల్‌ని సంప్ర‌దించింద‌ట‌ చిత్ర బృందం. కాన్సెప్ట్, పాట నచ్చడంతో కాజల్ కూడా ఈ స్పెష‌ల్ సాంగ్ చేయ‌డానికి వెంట‌నే గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఏదేమైనా.. కాజల్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మ‌రి… తార‌క్‌ సినిమాకు క‌లిసొచ్చిన కాజ‌ల్ ప్ర‌త్యేక గీతం… ఇప్పుడు బ‌న్నీ చిత్రానికి కూడా ప్ల‌స్ అవుతుందో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=08Fg-1DCHVs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + eighteen =