‘సిసింద్రీ’ త‌ర్వాత మ‌రోసారి అఖిల్‌కి అమ్మ‌గా ఆమ‌ని?

Amani To Play Akhil Mother Role Again,Telugu Filmnagar,Telugu Film Udates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Amani and Akhil To Team up For Again,Amani Role in Akhil New Movie,Akhil Upcoming Film News,Amani Re Entry in Akhil New Movie,Amani Plays an Important Role in Akhil Movie
Amani To Play Akhil Mother Role Again

“చిన్ని తండ్రి నిను చూడగా… వేయి కళ్ళైనా సరిపోవురా”… అంటూ ‘సిసింద్రీ’ (1995)లో ఆమని, అఖిల్‌పై చిత్రీకరించిన ఈ పాట ఎప్పటికీ అజరామరమే. ఊహ తెలియని వయసులోనే ‘సిసింద్రీ’తో క్యూట్ హిట్‌ను తన సొంతం చేసుకున్నాడు అఖిల్. హాలీవుడ్ మూవీ ‘బేబీస్ డే అవుట్’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో… తల్లీకొడుకులుగా ఆమని, అఖిల్ ప్రేక్షకులను కట్టిపడేశారు. కట్ చేస్తే… దాదాపు 24 ఏళ్ళ త‌రువాత మ‌రోసారి త‌ల్లీకొడుకులుగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారట‌ ఆమ‌ని, అఖిల్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… ‘అఖిల్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌… ఆ త‌రువాత‌ ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే, హీరోగా ఫర్వాలేదనిపించుకుంటున్నా సాలిడ్ హిట్ అయితే మాత్రం ఇంకా అఖిల్ కెరీర్‌లో పడలేదు. ఈ నేప‌థ్యంలో… ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో… `బొమ్మ‌రిల్లు`లో జ‌య‌సుధ పోషించిన పాత్ర త‌ర‌హాలో పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న అమ్మ పాత్ర ఒక‌టి ఉంద‌ట‌. ఆ పాత్ర‌లో అఖిల్‌కి ఆన్ స్క్రీన్ మదర్‌గా కలిసొచ్చిన ఆమని… హీరో త‌ల్లి పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఆమ‌ని ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

మ‌రి… ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని మంచి పట్టుదల మీదున్న అఖిల్‌కు… ఆమని ఫ్యాక్ట‌ర్ ఎంత‌వ‌ర‌కు క‌లిసొస్తుందో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=0hkQJ4rnR44]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 3 =