ఫైనల్లీ రిలీజ్ డేట్ ఖరారు

Voter Movie Gets a Release Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Voter Movie Release Date Fixed,Voter Movie Release Date Confirmed,Voter Movie Release Date Revealed,Voter Movie Release Date Announced,Voter Movie Latest Updates,Voter Movie Release Date Locked
Voter Movie Gets a Release Date

జి.ఎస్‌.కార్తిక్‌ దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఓటర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటి వరకూ రిలీజ్ కు నోచుకోలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.

తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జూన్ 21వ తేదీన ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు చిత్రయూనిట్. కాగా ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ గా సురభి నటిస్తుండగా… సంపత్ రాజ్, నాజర్, పోసాని కృష్ణమురళి, ప్రగతి కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జాన్‌సుధీర్‌ పూదోట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ ఎస్. సంగీతం అందిస్తున్నాడు. మరి పొలిటికల్ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై బాగానే ఆసక్తి నెలకొంది. మ‌రి చూద్దాం ఈ సినిమా మంచు విష్ణుకి సక్సెస్ తెచ్చిపెడుతుందో?లేదో?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here