వరుణ్ తేజ్ కు జోడీగా తెలుగమ్మాయి

Telugu Heroine For Varun Tej New Movie?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Varun Tej Valmiki Movie Latest Updates,Varun Tej New Movie Valmiki Heroine,Heroine Confirmed For Valmiki Movie,Telugu Heroine For Valmiki Film
Telugu Heroine For Varun Tej New Movie?

హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ మూవీ జిగర్తాండ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ మొదటిసారిగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. సెప్టెంబర్ 6వ తేదీన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా…ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరనస మన తెలుగమ్మాయిని సెలక్ట్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన కృష్ణ మంజూష అనే అమ్మాయిని ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంకా ఈ సినిమాలో పూజా హెగ్డే, తమిళ నటుడు అథర్వ మురళీ కీలక పాత్రలో నటిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమాతోపాటు ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. దీనిలో భాగంగానే వరుణ్ ఈ సినిమా కోసం ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు.

[subscribe]

[youtube_video videoid=-h5qq8W57B8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 1 =