నటసింహం ‘బాలకృష్ణ’కు పుట్టినరోజు శుభాకాంక్షలు

Wishing a Very Happy Birthday to Nandamuri Balakrishna,Telugu Filmnagar,Telugu Filmupdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nandamuri Balakrishna Birthday Special News,#HBDBalakrishna,Happy Birthday to Nandamuri Balakrishna,Nandamuri Balakrishna Birthday Celebrations,Balakrishna Turns 59 Years For Today
Wishing a Very Happy Birthday to Nandamuri Balakrishna

నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటనను వారసత్వంగా అందిపుచ్చుకొని.. తెలుగు సినీ పరిశ్రమలో తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని..టాప్ 4 అగ్ర హీరోల జాబితాలో నిలిచిన నటుడు నందమూరి బాలకృష్ణ. ఈ రోజు బాలకృష్ణ తన 58 వసంతాలు పూర్తి చేసుకొని 59వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు బాలకృష్ణ కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1974లో ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు బాలయ్య. ఈ సినిమాలో టీనేజర్ గా కనిపించిన ఆయన ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశారు. ‘సాహసమే జీవితం’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆతరువాత సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక ఇలా ఒక్క జోనర్ లో కాదు పలు జోనర్లలో సినిమాలు చేస్తూ.. ఏ పాత్రనైనా అవలీలగా పోషిస్తూ.. కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇక సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. టీడీపీ తరపున హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మొత్తం క్లీన్ స్వీప్ చేసినా కూడా బాలకృష్ణ అంతటి పోటీని తట్టుకొని కూడా గెలిచారంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ఆయనను ప్రజలు ఎంత గుర్తుపెట్టుకున్నారో.

ఇక ప్రస్తుతం సినిమాల సంగతికొస్తే కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మాతగా ఓ సినిమా అనుకున్నారు. ఎన్నికల తర్వాత ఇది ప్రారంభం అవ్వాల్సి ఉండగా స్క్రిప్టులో మార్పుల పేరుతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇటీవలే దిల్ రాజు.. బోయపాటి.. బాలకృష్ణ కాంబినేషన్ లో మరో సినిమా వస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. మరి ఏ సినిమా ముందు సెట్స్ పైకి వెళుతుందో చూద్దాం…మరి ముందు ముందు మరెన్నో సినిమాలతో బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉండాలని… మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుందాం..

[subscribe]
[youtube_video videoid=jUxnrFUYzBA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + six =