యాక్షన్ బిగిన్స్ – సాహో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Saaho Teaser Release Date Locked,Saaho Teaser Release Date Update,Telugu Filmnagar,Telugu Filmupdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Saaho Teaser Releasing on June 13th,Saaho Teaser Release Date Revealed,Saaho Teaser Release Date Announced,Saaho Teaser Release Date Fixed,Saaho Teaser Gets a Release Date,Prabhas Greets Fans With Saaho Update
Saaho Teaser Release Date Locked

ప్రభాస్ అభిమానులకు సాహో చిత్రయూనిట్ ఓ గుడ్ న్యూస్ ఇచ్చింది. సాహో నుండి షేడ్స్ ఆఫ్ సాహో పేరిట మేకింగ్ వీడియోలు రిలీజ్ చేయడమే తప్పా అంతకు మించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు ఇప్పటివరకూ సాహో టీమ్. దీంతో టీజర్, ట్రైలర్ల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు ఊరటనిస్తూ.. టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. ఈ నెల 13 (జూన్ 13)వ తేదీన సాహో టీజర్ ను రిలీజ్ చేయనునున్నట్టు యూపీ క్రియేషన్స్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటన ఇచ్చారు. జూన్ 14న థియేటర్లలో కూడా ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని సినిమా ప్రారంభం నుండే చెబుతున్నారు. డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో యాక్షన్ సన్నివేశాలను క్యాప్చర్ చేస్తున్నారట. అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సమక్షంలో హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు. మరి ఈ అద్భుతాన్ని చూడాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

కాగా రన్ రాజా రన్ సినిమాతో హిట్ కొట్టిన సుజిత్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్దా కపూర్ నటిస్తోంది. ఇంకా ఈసినిమాలో నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మందిర బేడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ అధినేతలు వంశీ ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగష్ట్ 15వ తేదీన `సాహో` విడుద‌లకానుంది.

[subscribe]

[youtube_video videoid=Z6WlMvYEc3Q]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + two =