ఇండియన్ సినిమాలో ఇదే ఫస్ట్ కాన్సెప్ట్ – తాప్సీ

Game Over Movie to have a Unique Concept,Telugu Filmnagar,Telugu Filmupdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Taapsee Pannu Latest Interview With Telugu Filmnagar,Taapsee Pannu Game Over Movie Latest News,Actress Taapsee About Game Over Movie,Taapsee Gets Candid With the Telugu Filmnagar,The Taapsee Pannu Interview: Game Over
Game Over Movie to have a Unique Concept

తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ అక్కడా.. ఇక్కడా కూడా బిజీ బిజీగా గడుపుతోంది తాప్సీ. బాలీవుడ్ లో ప్రస్తుతం రెండు..మూడు చిత్రాల్లో నటిస్తున్న తాప్సీ.. గేమ్ ఓవర్ అనే సినిమాతో మళ్లీ తెలుగు, తమిళ్ ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. జూన్ 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆమె ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్బంగా తాప్సీ మాట్లాడుతూ.. నిజానికి గేమ్ ఓవర్ మూవీ స్టోరీ నేను వినలేదు.. జస్ట్ స్క్రిప్ట్ చదివా అంతే.. అంతకుముందు నుండే వై నాట్ స్డూటియోస్ నుండి శశి నాకు కాల్ చేసి ఒకసారి చూడండి మీకు నచ్చితే.. తెలుగు, తమిళ్ లో చేద్దాం అని అన్నాడు. కానీ అప్పటికే నేను తమిళ్ లో వర్క్ చేసి చాలా కాలం అయిపోయింది. ఆ తరువాత స్క్రిప్ట్ చదివిన వెంటనే ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు నేను చేస్తానని చెప్పాను. ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ సినిమాలో ఇలాంటి కాన్సెప్ట్ నేను విన్నాను.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా.. నా క్యారెక్టర్ తో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా నాకు బాగా నచ్చింది.. నేను హిందీలో కూడా చాలా కాన్సెప్ట్స్ వింటున్నాను.. కాానీ అన్నింటికంటే ఈ సినిమా టాప్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఇది ఒక రిజినల్ సినిమాలాగా ఉండదు.. ట్రైలర్ చూసిన వారంతా ఈ సినిమా ఇండియా వైడ్ గా రిలీజ్ అవ్వాల్సిన సినిమా అంటున్నారు.. హిందీలో కూడా డబ్ చేయాలనుకుంటున్నాం.. అనురాగ్ కశ్యప్ ఈ సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు…చాలా గ్యాప్ తరువాత తెలుగులో వస్తున్న స్ట్రైట్ ఫిలిం ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానని తెలిపారు తాప్సీ.

ఈ సినిమాలో వీల్ చైర్ లో కూర్చొని నటించారు కదా ఎలా ఉంది..?

అవునండీ.. నా లైఫ్ లో ఇప్పటివరకూ ఎలాంటి ఫ్రాక్చర్ జరగలేదు.. రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయి వీల్ ఛైర్ లో కూర్చొవడం.. నా జీవితంలో ఎప్పుడూ అలాంటి ఎక్స్ పీరియన్స్ అవ్వలేదు.. 60 పర్సెంట్ ఈ సినిమాలో నేను వీల్ ఛైర్ లో ఉన్నాను.. షూటింగ్ లో చాలా భాగం నేను వీల్ ఛైర్ లోనే ఉంటాను. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాాలా డిమాండ్ ఉన్న రోల్ ఇది.. యాక్సిడెంట్ జరిగిన ఒక సంవత్సరానికి.. మళ్లీ యానివర్సిరీ రియాక్షన్ స్టార్ట్ అయ్యే ఒక ట్రోమా సమస్యతో బాధపడే క్యారెక్టర్..ఆ యాక్సిడెంట్ ఏంటో మీరు సినిమాలో చూడాల్సిందే.

ఏ లాంగ్వెజ్ లో అయినా సినిమాను మీ భుజాలపైనే వేసుకుంటున్నారు.. ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా..?

(నవ్వుతూ)నిజానికి ఆప్షన్స్ దొరకలేదు.. ఇలాంటి స్టోరీలే దొరికాయి కాబట్టి.. నేనే నా భుజాలపై మోయాల్సి వస్తుంది.. నాకు కూడా ఈ కథలు నచ్చాయి… మా డైరెక్టర్స్ కూడా చాలా బ్రిలియంట్.. వాళ్లే నాకు హీరోలు.. వాళ్లే అసలైన కెప్టెన్స్.. నేను స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కానీ.. షూటింగ్ లో ఉన్నప్పుడు కానీ.. సోలో హీరోయిన్ అని.. ప్రెజర్ ఎక్కువ ఉంటుందని.. నేనెప్పుడూ ఆలోచించలేదు. కానీ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు తాప్సీ ఇన్ గేమ్ ఓవర్ అని వార్తలు వచ్చాయి.. అప్పుడు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యాను.. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ నా పేరు పోస్టర్ లో రాలేదు. హిందీలో నామ్ షబానా అనే టైటిల్ రోల్ చేసినా కూడా అక్కడ పోస్టర్ లో పేరు వేయలేదు.. ఇది మాత్రం చాలా స్కేరీ గా ఉంది.. ఇప్పటి వరకూ నేను త్రీ లాంగ్వెజెస్ లో చేశాను.. చాలా లక్కీ.. కానీ నాకు ఇది అసలైన టెస్ట్.. కొంచెం నెర్వస్ గా ఉంది.

ఒక స్క్రిప్ట్ ను మీరు ఎంపిక చేసుకునేప్పుడు ఏం చూస్తారు..?

కెరీల్ స్టార్టింగ్ లో అసలు సినిమా అంటే ఏంటీ.. నటన అంటే ఏంటీ నాకు నిజంగా తెలీదు.. నేర్చుకోవాలని ఉండేది.. కానీ ఎలాగో తెలిసేది కాదు.. చిన్నచిన్నగా నేర్చుకోవడం మొదలుపెట్టాను.. చేసిన తప్పులు మరోసారి చేయకుండా చూసుకునేదాన్ని.. ఇప్పుడు స్క్రిప్ట్ విని డిసైడ్ చేసుకోగలుగుతున్నా.. స్క్రిప్ట్ విన్న ప్పుడు ఆడియన్స్ పెట్టే డబ్బుకు నేను న్యాయం చేయగలుగుతానా.. నా కథ నచ్చుతుందా అని ఆలోచిస్తాను.. వాళ్లు పెట్టే డబ్బుకు.. టైమ్ కు నా సినిమా నచ్చుతుందా అని ఆలోచిస్తున్నాను.

మీరు రియల్ లైఫ్ లో వీడియో గేమ్స్ ఆడుతారా?

ఆడేదాన్ని.. స్కూల్, కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు మారియో, బాట్ మాన్, కాంట్రా ఆడేదాన్ని.. ఆ తరువాత ఆడలేదు.

బద్లా సినిమా 100 కోట్లు పైగా కలెక్ట్ చేసింది.. మీరు ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారని అనుకోవడంలేదా?

అవును.. నా నుండి మంచి సినిమాలు రావాలని ఆడియన్స్ కూడా కోరుకోవాలనుకుంటాను.. ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా కిక్ ఏముంటుంది.. ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా సినిమాలు తీసి మాత్రం ఉపయోగం ఏముంది.. 100 కోట్లు కలెక్ట్ చేస్తుందా అంటే ఏం చెప్తాం.. మ్యాగ్జిమమ్ నా సినిమా అంత కలెక్ట్ చేయాలని ట్రై చేస్తా.. కానీ బద్లా బిగ్ సర్ ప్రైజ్ అందరికీ.. ఇంత కలెక్ట్ చేస్తుందని కూడా అనుకోలేదు.. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది.. ఆడియన్స్ ఏదో నవ్వుకోడానికో.. ఏదో పాటల కోసమో రారు.. థ్రిల్ ఎంజాయ్ చేయడానికి కూడా వస్తారు.. అయితే మనం వాళ్లను స్టోరీతో ఎంత ఎంగేజ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. గేమ్ ఓవర్ అలాంటిదే..

ఈ సినిమాలో సింగిల్ క్యారెక్టర్ కదా.. ఒక్క క్యారెక్టర్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించడం లేదా?

ఒక యాక్టర్ కు ఇది నిజంగా పరీక్ష లాంటిది. 95 పర్సెంట్ నన్నే చూడాలి ఈ సినిమాలో మీరు.. నా పెర్ఫామెన్స్ తో మీరు రెండు గంటలు సినిమా చూడాలి.. మీకు ఆప్షన్ లేదు.. ఇది నాకు టెస్ట్ లాంటిది.

హిందీలో సాండ్ కీ ఆంఖ్ చేస్తున్నట్టున్నారు..? ఆ రోల్ ను ఒప్పుకోవడానికి డిఫరెంట్ రోల్స్ చేయాలన్న భావనే కారణమా..?

డిఫరెంట్ రోల్ అండ్ టూ హీరోయిన్ ఒరియంటెడ్ సినిమా కోసం చూస్తున్నాను.. ఆ టైంలో సాండ్ కీ ఆంఖ్ దొరికింది.. 65 ఇయర్ ఓల్డ్ గెటప్ లో నటించడం చాలా హ్యాపీగా ఉంది… నాకు ఎక్స్ పెరిమెంట్స్ అంటే చాలా ఇష్టం అందుకే ఈ స్టోరీ నా దగ్గరకు వచ్చిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.

మీరు ఇప్పుడు మంచి ఫేజ్ లో ఉన్నారు.. ఇయర్ కు 3 నుండి 4 సినిమాలు అది కూడా క్వాలిటీ అండ్ క్వాంటిటీ సినిమాలు ఎంపిక చేసుకోవడం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు..?

దేవుని దయ వల్ల నా దగ్గరకు మంచి స్టోరీలే వచ్చాయి.. సో కథలు సెలక్ట్ చేసుకోవడం పెద్దగా కష్టం అనిపించలేదు.. సో హ్యాపీగా ఇయర్ కి మూడు నాలుగు సినిమాలు సెలక్ట్ చేసుకొని.. వర్క్ చేసుకుంటూ వెళ్లిపోవడమే. కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది.. కానీ నాకు ఇయర్ కు మూడు నాలుగు సినిమాలు చేయడం ఇష్టం.

అక్షయ్ కుమార్ తో వర్క్ చేశారు కదా.. ఆ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది..?

అక్షయ్ సార్ సాధించిన దాంట్లో సగం సాధించినా చాలు నేను రిటైర్ అవ్వొచ్చు (నవ్వుతూ)

రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ మిస్ అవుతున్నారా..?

ఎక్కువ కాదు.. కొంచెం మిస్ అవుతున్నా.. కమర్షియల్ మూవీ డెఫినేషన్ మారిపోయింది.. మంచి స్టోరీ ఉన్న మూవీ వస్తే గ్లామరస్ రోల్ చేయొచ్చు.. కానీ స్టోరీ కూడా ఉండాలి..

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏంటి..?

తమిళ్ లో ఒక సినిమా ఫైనల్ అయింది. గేమ్ ఓవర్ రిలీజ్ తరువాత ఆ సినిమా ప్రారంభం కానుంది. తెలుగులో రెండు మూడు స్టోరీలు విన్నా ఇంకా ఫైనలైజ్ కాలేదు. కానీ సంవత్సరానికి ఒక సినిమా మాత్రం పక్కా తీస్తా.

అశ్విన్ శరవనన్ ఈ సినిమాను హ్యాండిల్ చేస్తాడని మీకు అంత నమ్మకం ఎలా కలిగి ఈ స్టోరీ ఒప్పుకున్నారు..?

మయూరి సినిమా చూశారా..? ఈ సినిమా మొత్తం ఒకేసారి చూడలేదు… నాకు చాలా భయం.. పార్ట్ పార్ట్ లుగా చూశాను.. తను చాలా బ్రిలియంట్.. రైటింగ్ స్కిల్స్ కూడా సూపర్.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మాయ చూడలేదు.. కానీ స్టోరీ చదివాను.. చదివిన దానికంటే సినిమా చాలా బెటర్ ఉంది.. అందుకే తనపై నమ్మకంతోనే సినిమా చేశా..

మిమ్మల్ని డైరెక్టర్స్ యాక్ట్రెస్ అని అనొచ్చా..?

తప్పకుండా నేను డైరెక్టర్స్ యాక్ట్రెస్ నే..వారు నాకు చాలా బిగ్గెస్ట్ సపోర్టింగ్ సిస్టమ్ లాంటి వాళ్లు.. నా కెరీర్ లో నేను ఎదగడానికి చాలా హెల్ప్ చేసినవాళ్లు.. నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నానంటే వాళ్లే కారణం..

పెళ్లి చేసుకునే ప్లాన్స్ ఇప్పుడేమైనా ఉన్నాయా?

ఇప్పుడైతే లేవండి.. ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను.

[subscribe]
[youtube_video videoid=2fliIDAIiPY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 11 =