‘వాల్మీకి’ ప్రీ టీజర్ త్వరలో

Varun Tej Valmiki Pre Teaser To be Released Soon

హరీష్ శంకర్ దర్శకత్వంలో కోలీవుడ్ మూవీ ‘జిగర్తాండ’ సినిమా రీమేక్ ‘వాల్మీకి’ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో వరుణ్ మొదటిసారిగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే సోషల్ మీడియా పుణ్యమా అంటా.. సినిమా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. చిత్ర యూనిట్ కూడా షూటింగ్ ఎక్కడ జరిగినా.. ఎలా జరిగినా.. ఇలా వాటికి సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా హరీష్ శంకర్ ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి ప్రీ టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే డేట్ మాత్రం చెప్పలేదు. మరి డేట్ ఎప్పుడు చెబుతారో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో తమిళ యువ హీరో అథర్వ మురళి.. ఆయనకు జోడీగా తమిళ డబ్ స్మాష్ ఫేమ్ మృణాళిని రవి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాతోపాటు ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. దీనిలో భాగంగానే వరుణ్ ఈ సినిమా కోసం ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు. మరి వరుస విజయాలతో దూసుకుపోతున్న వరుణ్ కు ఈ సినిమాలు ఎంతవరకూ విజయం తెచ్చిపెడతాయో చూద్దాం.. [subscribe]

[youtube_video videoid=t-SWlHFaFUk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 4 =