తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడైనా కానీ అవేమీ పట్టించుకోకుండా వైవిధ్యమైన పాత్రలు, కథలు ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్. తన నటన, ఫైట్లు, డ్యాన్స్‌లతో తమిళ ప్రేక్షకులను మెప్పించారు. తెలుగులో కూడా ధనుష్ కు మంచి అభిమానులు ఉన్నారు. ఇక బాలీవుడ్ లో కూడా ‘రాన్‌ఝానా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటాడు. అలా తమిళ్, తెలుగు, హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్.. హాలీవుడ్‌కు వెళ్తున్న సంగతి కూడా తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ అనే సినిమాతో ధనుష్ హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. రోమెయిన్ ప్యూర్టోలస్ రాసిన ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ నవల ఆధారంగా కెనడాకు చెందిన కెన్ స్కాట్ ఈ సినిమాకు తెరకెక్కించారు. ఈనెల 21న ఈ చిత్రం విడుదలవుతోంది. ఇంగ్లీష్ తో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను విడుదలచేయనున్నారు. ‘పక్కిరి’ అనే పేరుతో తమిళంలో విడుదలవుతోంది.
ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ధనుష్ ఫకీర్ పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం కామెడీగా ఉంటుందని అర్థమవుతోంది. సినిమాలో ధనుష్ మినహా మిగిలినవారంతా హాలీవుడ్ నటులే. చూస్తుంటే ధనుష్ హాలీవుడ్ లో కూడా మంచి హిట్ కొట్టేలాగనే కనిపిస్తున్నాడు. మరి ట్రైలర్ అయితే ఓకే.. సినిమా మొత్తం ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=H1WASu-s4eA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: