మ‌కుటంలేని మ‌హారాజు… సూప‌ర్ స్టార్‌ కృష్ణ

Wishing Super Star Krishna Garu A Very Happy Birthday,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Happy Birthday to Super Star Krishna,Super Star Krishna Birthday Special News,Super Star Krishna Birthday Celebrations,#HBDSuperStarKrishna
Wishing Super Star Krishna Garu A Very Happy Birthday

“నవ్వులు రువ్వే పువ్వమ్మా… ఆ నవ్వులు నాకు ఇవ్వమ్మా” … ఈ పాటలాగే స్వచ్చమైన, నిష్కల్మషమైన నవ్వుకు చిరునామాగా నిలిచారు సూపర్ స్టార్ కృష్ణ. డేరింగ్ అండ్ డాషింగ్ అనే పదాలకి అసలు సిసలైన అర్థం చెప్పిన కృష్ణ… 1944 మే 31న గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ‌ దంపతులకు జన్మించారు. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. నేటితో ఈ న‌ట‌శేఖ‌రుడు 75 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కృష్ణ‌ సినీ ప్రయాణానికి సంబంధించిన జ్ఞాప‌కాల్లోకి వెళితే…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త‌న 21వ ఏట ‘తేనెమనసులు’ (1965)చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు క‌థానాయ‌కుడిగా పరిచయమైన కృష్ణ‌… చిత్ర‌చిత్ర ప్ర‌వ‌ర్ధ‌మానంగా సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. కేవ‌లం న‌ట‌న‌కే ప‌రిమితం కాకుండా దర్శకుడిగానూ, నిర్మాతగానూ, ఎడిట‌ర్‌గానూ పలు విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. మ‌హాన‌టులు యన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత సాంఘికం, థ్రిల్లర్, యాక్షన్, జానపదం, పౌరాణికం, చారిత్రకం… ఇలా ప‌లు జాన‌ర్స్‌లో సినిమాల‌ను చేసిన ఘనత ఆ త‌రంలో కృష్ణకే ద‌క్కింది. అంతేకాదు… జేమ్స్ బాండ్, కౌబాయ్ పాత్రలలోనూ నటించి తెలుగు సినీ ప్రేమికుల మెప్పు పొందారు. వెండితెర ‘అల్లూరి సీతారామరాజు’గా తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో కొలువుదీరారు. అలాగే.. ‘సింహాసనం’ సినిమాతో 70 ఎం.ఎం.. స్టీరియోఫోనిక్ సౌండ్ లాంటి టెక్నాలజీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి మురిపించారు.

కృష్ణ నిర్మాతల కథానాయకుడు. నిర్మాతల మేలు కోరే మనిషి. అందుకే వారితో ఎల్లప్పుడూ సినిమాలు సాగుతూ ఉండాలనే కోరుకున్నారు గాని… ఏ రోజు ఆర్ధికపరమైన లాభనష్టాలను బేరీజు వేసుకోలేదు. నిర్మాణ రంగంలో కూడా మంచి పట్టు ఉన్న కృష్ణ… తన సోదరుడు జి.ఆదిశేషగిరిరావును నిర్మాతగా పెట్టి పలు సినిమాలను నిర్మించారు. అంతేకాదు… తానే స్వయంగా నిర్మాతగా మారి ‘సింహాసనం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించారు.

ఇక దర్శకుడిగా కృష్ణ తొలిసారి మెగాఫోన్ పట్టుకున్న సినిమా కూడా ‘సింహాసనం’ కావడం విశేషం. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం… విడుదలైన మొదటివారంలోనే భారీ వసూళ్లను రాబట్టి దర్శకుడిగా కృష్ణ స్టామినాను తెలియ‌జేసింది. ఈ చిత్రాన్ని హిందీలో ‘సింఘాసన్’ పేరుతో రీమేక్ చేయగా… ఆ చిత్రానికి కూడా కృష్ణ దర్శకత్వం వహించడం విశేషం. కాగా… ‘సింహాసనం’ తర్వాత దాదాపు 12 సినిమాలకు దర్శకత్వం వహించారు కృష్ణ. అందులో మహేష్ బాబు బాల నటుడిగా నటించిన ‘ముగ్గురు కొడుకులు’, ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రాలు కూడా ఉండడం విశేషం.

ఇలా… 50 ఏళ్ళ సుదీర్ఘ ప్ర‌యాణంలో 340కి పైగా చిత్రాల్లో అల‌రించారు సూపర్ స్టార్. ఇటీవ‌ల‌… భవిష్యత్తులో తనయుడు మహేష్, మనవడు గౌతమ్ కృష్ణతో కలిసి నటించే అవకాశం వస్తే బావుంటుందని తన అభిలాష‌ను వెల్లడించారు కృష్ణ‌. సూప‌ర్ స్టార్ కోరిక త్వ‌ర‌లోనే నెర‌వేరాలని ఆశిస్తూ… మరోసారి ఈ బుర్రిపాలెం బుల్లోడికి 75వ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది ది తెలుగుఫిల్మ్‌న‌గ‌ర్‌.కామ్‌.

[subscribe]

[youtube_video videoid=2nNvLIyGrGE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 2 =