ఫ‌ల‌క్‌నుమా దాస్ తెలుగు మూవీ రివ్యూ

Falaknuma Das Telugu Movie Review,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviews,Falaknuma Das Movie Review and Rating,Falaknuma Das Movie Review,Falaknuma Das Review,#FalaknumaDasReview,Falaknuma Das Movie Story,Falaknuma Das Movie Plus Points,Falaknuma Das Movie Mouth Talk,Falaknuma Das Movie Public Response,Falaknuma Das Movie Live Updates
Falaknuma Das Telugu Movie Review

ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లతోనే ‘ఫ‌ల‌క్‌నుమా దాస్‌’ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాడు విశ్వక్ సేన్. పాతబస్తీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఏమేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు : విశ్వక్‌ సేన్‌, హర్షిత గౌర్, సలోని మిశ్రా, తరుణ్ భాస్కర్, ఉత్తేజ్, ప్రశాంతి చౌరోలింగం తదితరులు.
దర్శకత్వం : విశ్వక్ సేన్
నిర్మాత : కరాటీ రాజు
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫర్ : విద్యా సాగర్

కథ

దాస్(విశ్వక్ సేన్) అనే యువకుడు ఫ‌ల‌క్‌నుమాలోనే పుట్టి, అక్కడే చదువుకుంటూ ఉంటాడు. అయితే దాస్ చిన్నప్పటి నుండే శంకరన్న అనే రౌడీషీటర్ చేసే పనులను చూసి ఆకర్షితుడై… తాను కూడా తన స్నేహితులతో కలిసి చిన్నప్పటి నుండే గొడవలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. దాస్ అండ్ ఫ్రెండ్స్ బ్యాచ్ కి పాండు(ఉత్తేజ్) అనే వ్యక్తి సపోర్ట్ చేస్తుంటాడు. అలా గొడవలు పడుతూనే మరో పక్క టీనా.. సఖి అనే అమ్మాయిలతో ప్రేమాయణం సాగిస్తుంటాడు. ఇదిలా ఉండగా రౌడీషీటర్ శంకరన్నని రవి, రాజు అనే ఇద్దరు వ్యక్తులు చంపేస్తారు. అయితే అలాంటి వారితోనే దాస్ వ్యాపారం చేయాల్సి వస్తుంది. అలాంటి వారితో కలిసి పని చేయడం ఇష్టం లేకపోయినా తప్పక వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో దాస్ అనుకోకుండా చేసిన పొరపాటుతో హత్య కేసులో ఇరుక్కుంటాడు. దాస్ ఆ కేసు నుండి బయటపడ్డాడా ? లేదా ? తన ప్రేమను ఎలా గెలిపించుకుంటాడు..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ

‘వెళ్లిపోమాకే’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి చిత్రాల్లో నటించిన విశ్వక్ సేన్ ఈసారి హీరోగా, డైరెక్టర్ గా ‘ఫ‌ల‌క్‌నుమా దాస్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. తన యాటిట్యూడ్ తో, బోల్డ్ డైలాగ్స్ తో ఈ సినిమాకు మంచి క్రేజ్ తీసుకొచ్చాడు. ఇక అదే యాటిట్యూడ్ ను ఈ సినిమాలో కూడా చూపించాడు. నిజానికి ఈ సినిమా మలయాళం మూవీ రీమేక్ అయినా చాలా జాగ్రత్తలు తీసుకొని.. మన నేటివిటీకి తగ్గట్టుగా సినిమాలో చేసిన మార్పులు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నేపధ్యాన్ని హైదరాబాద్ పాతబస్తీ పరిసరాలకు మార్చడం సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్ అయింది.

ఇక డైరెక్టర్ హీరోగా చేసిన విశ్వక్ సేన్ సినిమా మొత్తం తన భుజాలపై నడిపించాడు. ఫ‌ల‌క్‌నుమా దాస్‌ పాత్రలో జీవించేశాడు. లోకల్ మాస్ కుర్రాళ్లు ఎలా ఉంటారో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. సినిమాలో తన నటనతో, మ్యానరిజమ్స్ తో.. విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. చాలా రోజుల తరువాత ఉత్తేజ్ కి మంచి పాత్ర దక్కింది. తరుణ్ భాస్కర్ తన నటనతో అందరికీ షాక్ ఇచ్చాడు. ‘యస్.ఐ’గా నటించిన తరుణ్ భాస్కర్ సినిమాలో కనిపించనంతసేపూ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన నటనతో ఆకట్టుకున్నారు. తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ నటన సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయి. హీరోయిన్లు హర్షిత గౌర్ అండ్ సలోని తమ పాత్ర మేర నటించారు.

ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ వివేక్ సాగర్ అందించిన సంగీతం. ముఖ్యంగా నేపధ్య సంగీతం మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ మెప్పిస్తుంది. ప్రతి ఫ్రేమ్ చాలా సహజంగా.. సహజత్వానకిి దగ్గరగా ఉంటుంది.

ప్లస్ పాయింట్స్

విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్
సంగీతం

మైనస్ పాయింట్స్

సెకండాఫ్

ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమాలో కాస్త అక్కడక్కడ అభ్యంతరకర డైలాగ్స్ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చుతుందని చెప్పలేం…అయితే యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..

ఫ‌ల‌క్‌నుమా దాస్ తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • ScreenPlay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

[subscribe]
[youtube_video videoid=JxLXURcTA0k]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =