మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన శ‌ర్వానంద్‌?

Sharwanand Gives Green Signal For Another Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sharwanand Busy With Multiple Projects,Sharwanand New Movie Updates,Actor Sharwanand Next Film News,Sharwanand Gets Busy With Crazy Films
Sharwanand Gives Green Signal For Another Movie

ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టే యువ కథానాయకులలో శర్వానంద్ ఒకరు. ఆ మ‌ధ్య టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్‌ వర్మ డైరెక్షన్‌లో సినిమా చేస్తూనే… తమిళ రీమేక్ చిత్రం ‘96’ను పట్టాలెక్కించాడు ఈ టాలెంటెడ్ హీరో. ఇక తాజాగా సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్ మూవీని పూర్తి చేసిన శ‌ర్వా… ఇప్పుడు ‘96’ షూటింగ్‌లో పాల్గొంటూనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళే ఆలోచనలో ఉన్నాడట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ‘భలే మంచి రోజు’, `శమంతకమణి’, ‘దేవదాస్’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేయనున్నాడని స‌మాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన‌ మరిన్ని వివరాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డికానున్నాయి.

ఇదిలా ఉంటే… శర్వా, సుధీర్ వర్మ కలయికలో తెర‌కెక్కిన సినిమా ఫస్ట్ లుక్‌ను ఈ రోజు (మే 25న) సాయంత్రం గం.4.05ని.లకు విడుదల చేయనున్నట్టు సమాచారం. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని జూలై 5న రిలీజ్‌ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే… సమంత హీరోయిన్‌గా నటిస్తున్న తమిళ రీమేక్ చిత్రం ‘96’ సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=IrfmK-Tmmto]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − ten =