తెలుగు తెర‌కు స‌రికొత్త గ్లామ‌ర్ అద్దిన ద‌ర్శ‌కేంద్రుడు

Telugu FilmNagar Wishes K Raghavendra Rao A Very Happy Birthday,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Happy Birthday to K Raghavendra Rao,Director K Raghavendra Rao Birthday Celebrations,K Raghavendra Rao Birthday Special News,Tollywood Director K Raghavendra Rao Latest News
Telugu FilmNagar Wishes K Raghavendra Rao A Very Happy Birthday

సినిమా అంటేనే గ్లామ‌ర్ ప్ర‌పంచం. అలాంటి ప్ర‌పంచానికి స‌రికొత్త సొబ‌గులు అద్దిన ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్రరావు. గ్లామ‌ర్‌ని త‌న గ్రామ‌ర్‌గా చేసుకుని స్టార్ డైరెక్ట‌ర్‌గా రాణించిన వైనం ఈ ద‌ర్శ‌కేంద్రుడి సొంతం. అందుకే… స‌మ్మోహ‌న‌ప‌రిచే ఆయ‌న ద‌ర్శ‌క‌ప్ర‌తిభ‌కు వెండితెర సైతం మురిసిపోయింది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి కొత్త అర్థం చెపుతూనే… అందులో అన్ని ర‌కాల భావోద్వేగాల‌కు చోటివ్వ‌డం రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌త్యేక‌త‌. అలాగే… ప్ర‌తీ ఫ్రేమ్‌ని ఒక పెయింటింగ్‌లా తీర్చిదిద్ద‌డంలో ఆయ‌న శైలే వేరు. ఇక పాట‌ల‌ను ఆయ‌న‌ ఆవిష్క‌రించే విధానం… ప‌లువురు ద‌ర్శ‌కుల‌కు స్ఫూర్తిగా నిల‌చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క‌థానాయిక‌ల‌ను ఎంత అందంగా చూపిస్తారో… క‌థానాయ‌కుల‌ను కూడా హీరోయిజం విష‌యంలో అదే స్థాయిలో ఎలివేట్ చేయ‌డంలో రాఘ‌వేంద్ర‌రావు దిట్ట‌. అన్ని ర‌కాల‌ జాన‌ర్‌లోనూ సినిమాల‌ను రూపొందించ‌డ‌మే కాదు… ప‌లు ఘ‌న‌విజ‌యాల‌ను అందుకున్నారు. కేవ‌లం తెలుగుకే ప‌రిమితం కాకుండా హిందీ, క‌న్న‌డ చిత్ర‌సీమ‌ల్లోనూ రాణించారు ఈ ద‌ర్శ‌కేంద్రుడు.

నంద‌మూరి తార‌క రామారావు, నాగేశ్వ‌ర‌రావు, కృష్ణ‌, శోభ‌న్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్‌… ఇలా రెండు త‌రాల అగ్ర క‌థానాయ‌కుల‌తో అనేక విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించారాయ‌న‌. అంతేకాదు… వెంక‌టేష్‌, మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ వంటి అగ్ర క‌థానాయ‌కులు కె.రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్‌తో వెండితెర‌పై తొలి అడుగులు వేశారు. నేడు కె.రాఘ‌వేంద్ర‌రావు పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కేంద్రుడు ఇలాంటి పుట్టిన రోజులు మ‌రిన్ని జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షిస్తోంది ది తెలుగుఫిల్మ్‌న‌గ‌ర్‌.కామ్‌.

[subscribe]

[youtube_video videoid=r_Jl8BHWoqw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − one =