వెంకటేష్ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ కు 23 ఏళ్ళు

23 Years For Venkatesh Intlo Illalu Vantintlo Priyuralu,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Venkatesh Intlo Illalu Vantintlo Priyuralu Movie Latest Updates,Intlo Illalu Vantintlo Priyuralu Movie Completes 23 Years,Venkatesh Intlo Illalu Vantintlo Priyuralu Movie Turns 23 Years
23 Years For Venkatesh Intlo Illalu Vantintlo Priyuralu

విక్టరీ వెంకటేష్ క‌థానాయ‌కుడిగా పలు కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ ఒకటి. ‘అబ్బాయిగారు’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ త‌ర్వాత వెంకీ, ద‌ర్శ‌కుడు ఇ.వి.వి.సత్యనారాయణ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా ఇది. అలాగే హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న వెంక‌టేష్‌, సౌందర్య కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి సూప‌ర్ హిట్ మూవీ ఇది. అంత‌కుముందు సూప‌ర్ పోలీస్‌లో న‌టించిన ఈ ఇద్ద‌రూ… ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు త‌రువాత ప‌విత్ర బంధం, పెళ్ళిచేసుకుందాం, రాజా, జ‌యం మ‌న‌దేరా, దేవీపుత్రుడు చిత్రాల్లో జంట‌గా న‌టించి అల‌రించారు. వినీత మ‌రో క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, బాబుమోహన్ తదితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంగీత ద‌ర్శ‌కుడు కోటి స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ శ్రోతలను అలరించాయి. ముఖ్యంగా “అమ్మనే అయ్యనురా” పాట మనసును తాకగా… “ప్రియురాలే ప్రేమగా” మంచి క్లాసిక్ టచ్ ఉన్న పాటగా నిలిచింది. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఈ హిలేరియ‌స్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని నిర్మించారు. 1996 మే 23న విడుదలైన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’… నేటితో 23 వసంతాలను పూర్తి చేసుకుంది.

[subscribe]

[youtube_video videoid=iE4rbYULOgQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + fourteen =