బన్నీ సినిమాలో నివేదా, కేతిక?

Two Other Heroines Roped In For Allu Arjun And Trivikram Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun And Trivikram Movie Heroines,Niveda Thomas and Katrina to Work With Allu Arjun,Allu Arjun New Movie Heroines,#AA19 Movie Heroines
Two Other Heroines Roped In For Allu Arjun And Trivikram Movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘నాన్న నేను’, ‘అలకనంద’ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాగా… ఇందులో బ‌న్నీకి జంట‌గా స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే ఓ హీరోయిన్‌గా నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాకు సంబంధించి రెండు ఆసక్తికరమైన వార్తలు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అవేమిటంటే… ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో న‌డిచే ఈ సినిమాలో బన్నీకి సిస్టర్‌గా యంగ్ హీరోయిన్‌ నివేదా థామస్ నటించనుందని టాక్. అలాగే… ఈ సినిమాలో మరో కథానాయికకూ స్థానముందని… ఆ పాత్ర కోసం రొమాంటిక్‌ ఫేమ్‌ కేతికా శర్మను ఎంపిక చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే వీరిద్దరి ఎంట్రీపై క్లారిటీ రావ‌చ్చు.

ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం… త్వ‌ర‌లోనే రెండో షెడ్యూల్‌కి ముస్తాబ‌వుతోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

[subscribe]

[youtube_video videoid=Qet0IxVPoe8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − nine =