విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్ ఎవ‌రంటే…

Interesting Facts About Vijay Deverakonda Hero Movie Heroine,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Vijay Deverakonda Hero Movie Latest Update,Interesting Facts About Hero Movie Heroine,Vijay Deverakonda New Movie Heroine,Vijay Deverakonda Next Film Heroine
Interesting Facts About Vijay Deverakonda Hero Movie Heroine

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘హీరో’. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ ప్రొఫెష‌న‌ల్ బైక్ రేసర్‌గా దర్శనమివ్వనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం… ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. రేప‌టి నుండి (మే 22) ఢిల్లీలో రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుందీ సినిమా. తెలుగుతో పాటు త‌మిళ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఏక‌కాలంలో తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ద్వారా ఆనంద్ అన్నామ‌లై ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. పేట‌లో కీల‌క పాత్ర పోషించిన‌ మాళ‌వికా మోహ‌న‌న్ ఈ చిత్రంతో తెలుగు తెర‌కు నాయిక‌గా ప‌రిచ‌య‌మ‌వుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మాళ‌విక మ‌రెవ‌రో కాదు… రీసెంట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘మహర్షి’ సినిమాకి కెమెరామేన్‌గా పని చేసిన కె.యు.మోహనన్ కుమార్తె. కాగా… హీరో సినిమాలో మాళ‌విక మ్యూజిషియ‌న్‌గా న‌టిస్తోందట‌. ఈ విష‌యాన్ని ఓ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా చెప్పుకొచ్చిందీ అమ్మ‌డు. అంతేకాదు… న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర ఇద‌ని… విజ‌య్‌తో క‌ల‌సి న‌టించ‌డం సూప‌ర్ ఎగ్టైటెడ్‌గా ఉంద‌ని తెలిపింది మాళ‌విక‌. అలాగే.. ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోనున్న‌ట్లు… తెలుగు భాష మీద ప‌ట్టు కోసం ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ కూడా తీసుకుంటున్న‌ట్లు చెప్పింది. అదేవిధంగా… జూన్ నుంచి త‌న పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని తెలిపింది మాళ‌విక. మ‌రి… హీరోతో మాళ‌విక ఏ స్థాయిలో అల‌రిస్తుందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=GE7h77dDGjM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − five =