అద్భుత నట గాయక వక్తృత్వ బాద్ షా ఎన్టీఆర్

Telugu FilmNagar Wishes Jr NTR A Very Happy Birthday,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News 2019 Latest Telugu Movie News,TJunior NTR Turns 36 : The Modern Dialogue King of Chaste Telugu,Jr NTR Birthday Special News,Junior NTR Turns 36 Birthday For Today,#HBDJrNTR,Jr NTR Birthday Celebration News
Telugu FilmNagar Wishes Jr NTR A Very Happy Birthday

మే 20- ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మీద ప్రత్యేక అభినందన వ్యాసాలు రాయమని ప్రతి మీడియా హౌస్ తన ప్రతినిధులను ఆదేశిస్తుంది. అందరూ కలాలకు పని చెబుతారు. అయితే ఇన్నేళ్ల తరువాత, ఇన్ని జయాపజయాల ప్రస్థానం తర్వాత ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ గురించి ఏమి రాయాలి? ఎలా రాయాలి? ఎక్కడ మొదలు పెట్టాలి?అనే స్టార్టింగ్ ట్రబుల్ ప్రతి జర్నలిస్టుకు ఎదురవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజమే… చూస్తుండగానే  కళ్ళ ముందు గొప్పోడిగా  ఊహాతీతమైన ఎత్తులకు ఎదిగిన ఒకప్పటి ఈ  బుడ్డోడు” గురించి ఇప్పుడు  కొత్తగా చెప్పటానికి ఏమీ లేకపోయినప్పటికీ ఏ సినిమాకు ఆ సినిమాలో కొత్త తరహాలో అలరించే అతని అభినయ సామర్థ్యాన్ని గురించి  ఎంత గొప్పగా చెప్పినా తక్కువే అవుతుంది. చేస్తున్న ప్రతి పాత్రలో ఒక వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తూ, వేస్తున్న ప్రతి అడుగులో ఒక  ఛాలెంజ్ ని స్వాగతిస్తూ ఎన్టీఆర్ సాధిస్తున్న, సాగిస్తున్న అద్వితీయ ప్రస్థానం అద్భుతం… అనితర సాధ్యం.

పువ్వు పుట్టగనే పరిమళించును, పిట్ట కొంచెం కూత ఘనం – వంటి దేశవాళీ అభినందనలను ‘ఆది’ నుండే అందుకున్న ఎన్టీఆర్  కెరీర్ లోని ప్రతి అడుగులో, ప్రతి దశలో తన ప్రత్యేకతను ఆవిష్కరించుకున్నారు.బాల నటుడిగా తన తాత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు తొలి గురువుగా ఆయన దర్శకత్వంలో “బ్రహ్మర్షి విశ్వామిత్ర” హిందీ వెర్షన్లో  బాల భరతుడిగా నటించాడు ఎన్టీఆర్. 


ఆ తరువాత గుణశేఖర్ దర్శకత్వంలో ఎమ్మెస్ రెడ్డి నిర్మించి“రామాయణం”లో రాముడి పాత్రను అద్వితీయంగా పోషించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ విధంగా రామాయణంలో ఆదర్శ సోదరులైన రామ-భరత పాత్రల పోషణతో బాల నటుడిగా మెప్పించిన ఎన్టీఆర్ చూస్తుండగానే నవ యువకుడు గా ఎదిగాడు. మే 25- 2001న విడుదలైన “చూడాలని ఉంది” తో హీరోగా  ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్ 2018 అక్టోబర్ 11న విడుదలైన “అరవింద సమేత వీర రాఘవ” తో18 సంవత్సరాలలో 28 చిత్రాలను పూర్తి చేసుకున్నారు. ఈ 28 చిత్రాలలోఅద్భుత విజయాలు, యావరేజ్ లు ,  అట్టర్ ఫ్లాప్ లు ఉన్నాయి.ఈ 18 సంవత్సరాల 28 చిత్రాల ఎన్టీఆర్ కెరీర్ లో రెండు ఫేజ్ లు  ఉన్నాయి.1వ చిత్రం” నిన్ను చూడాలని” నుండి13 వ చిత్రం ” రాఖీ” వరకు తొలి దశ.14 వ చిత్రం” యమదొంగ” నుండి 28 వ చిత్రం” అరవింద సమేత..” వరకు రెండవ దశ.

బొద్దుగా ముద్దుగా కొండకచో కొంచెం మొద్దుగా ఉన్న తొలిదశలో స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి వంటి 3 పెద్ద హిట్స్, సాంబ, అశోక్, రాఖీ వంటి యావరేజ్ హిట్స్ ఉన్నాయి. ఇక రాఖీ నాటికి ఎన్టీఆర్ ఆకార ఆహార్యాలు అదుపుతప్పి హీరో అనేవాడు ఇలా ఉండకూడదు అనే పరిస్థితి ఎదురైంది. నిజానికి ఎన్టీఆర్ అదే ఆకారంతో కంటిన్యూ అయి ఉంటే విజయాల సంగతి ఏమోగానీ విమర్శలు వెల్లువెత్తి ఉండేవి.అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఒంటిని వింటిలా మార్చుకుని “యమదొంగ”గా వచ్చి అందరి మనసులు దోచుకున్నాడు. శారీరకంగా ఎన్టీఆర్ లో వచ్చిన ఆ మార్పు  ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్ తో బాధపడుతున్న ఎంతో మందికి గొప్ప ఊరటనిచ్చింది… వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

అయితే ఇది అంత తేలికగా వచ్చిపడిన వరం కాదు… తనను తాను చిత్రహింసకు గురి చేసుకుని, తనకు తానే నరకం చూపించుకుని, తనను తానే జయించుకున్న ఒక అంతరంగిక అంతర్యుద్ధ ఫలితమే ఆ మార్పు … ఆ మార్క్.మనసుకు శరీరానికి  మధ్య జరిగిన ఆ యుద్ధంలో విజేతగా నిలిచి గెలిచిన ఎన్టీఆర్ పునః విజృంభణ అప్రతిహతంగా సాగుతోంది.అంతకుముందు చిత్రాలలో ఎన్టీఆర్ అభినయ ప్రయత్నం గొప్పగానే ఉన్నప్పటికీ బొద్దుతనం వల్ల ముఖంలో ఎక్స్ప్రెషన్ expose అయ్యేది కాదు. ముఖ్యంగా రాఖీ నాటికి ఎన్టీఆర్ శారీరక స్థితి చాలా ఇబ్బందికరంగా తయారైంది.

కానీ ఈ మేకోవర్ తర్వాత ఎన్టీఆర్ ప్రతి కదలికలో, కంటిచూపులో అత్యున్నత అభినయ ప్రమాణాలు పలకటం ప్రారంభమైంది. కళ్ళల్లో కొత్త వెలుగు, శరీరంలో మెరుపు వేగం రెట్టింపు అయ్యాయి.ఈ మార్పులన్నీ వెండితెర మీద అద్భుత పాత్రల ఆవిష్కరణకు తెరతీశాయి. అందుకే యమదొంగ తో ప్రారంభమైన ఎన్టీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ లో అదుర్స్, బృందావనం, బాద్షా, టెంపర్,నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ,అరవింద సమేత వంటిమాస్టర్ పీసెస్ వచ్చాయి.సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచిన ఈ సినిమాల్లోనే కాదు.. ఫెయిల్యూర్స్ అనిపించుకున్న కంత్రి, శక్తి, దమ్ము వంటి చిత్రాలలో కూడా ఎన్టీఆర్ యాక్టింగ్  స్టామినాకు అద్భుత ప్రశంసలు లభించాయి. తన ముందు ఒక చాలెంజ్ గా నిలిచి సవాల్ విసిరిన ప్రతి పాత్రకు అద్భుత అభినయంతో దీటైన సమాధానం చెప్పారు ఎన్టీఆర్. ముఖ్యంగా “అదుర్స్” లోని డ్యూయల్ రోల్ లో ప్రదర్శించిన వైవిధ్యం అద్భుతం, అనితర సాధ్యం అనే చెప్పాలి.

సినిమా ఆశించినంత విజయం కాకపోయినప్పటికీ “ఊసరవెల్లి” లో ఎన్టీఆర్ నటన మతి పోగొడుతుంది . ఇక నెగటివ్ షేడ్స్ తో ప్రారంభమయ్యే “టెంపర్”చిత్రంలోని కరెప్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎన్టీఆర్పర్ఫార్మెన్స్ అల్టిమేట్. ఇక ఎన్టీఆర్ యాక్టింగ్ హైట్స్ కు మరొక గొప్ప హిమాలయన్ ఎగ్జాంపుల్ “జనతా గ్యారేజ్” . ఆపై “ జై లవకుశ” చిత్రంలో త్రిపాత్రాభినయంతో ఎన్టీఆర్ ప్రదర్శించిన అభినయ విశ్వరూపం నటనకే ఒక అప్డేటెడ్ డిక్షనరీగా  నిలుస్తుందనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. మూడు పాత్రల మధ్య అద్భుత వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో తాతను తలపించాడు ఎన్టీఆర్.ఇదే సందర్భంలో ఒక గొప్ప రికార్డ్ గురించి చెప్పుకోవాలి. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల నటులైన  తాత, బాబాయ్, మనవడు, త్రిపాత్రాభినయం చేసిన ఘనత ఒక్క నందమూరి ఫ్యామిలీ కే దక్కుతుంది. “దానవీరశూరకర్ణ” చిత్రంలో ఎన్టీ రామారావు, అధినాయకుడు చిత్రం లో బాలకృష్ణ, జైలవకుశ లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసి మెప్పించటం నందమూరి ఫ్యామిలీ మీద శాశ్వితంగా నిలిచిపోయే  ఒక అన్బీటబుల్ రికార్డ్.

ఇలా ఒక విశిష్ట నటుడిగా ప్రతి సినిమాలో అత్యున్నత అభినయ ప్రమాణాలను ఆవిష్కరిస్తున్న ఎన్టీఆర్ other than acting కూడా The Best అనిపించుకోవటం అభినందనీయం. ముఖ్యంగా గాయకుడిగా, అద్భుతమైన వక్తగా కూడా రాణించడం ఎన్టీఆర్ లో అదనపు ఆకర్షణలు. కాంటెంపరరీ స్టార్స్ అప్పుడప్పుడు తమ పాటలు తామే పాడుకుంటున్నప్పటికీ ఆ విషయంలో ఎన్టీఆర్ కు గొప్ప హిట్స్ ఉండటం విశేషం.

“యమదొంగ” చిత్రంలో కీరవాణి సంగీత సారథ్యంలో “ఓలమ్మితిక్కరేగిందా”- పాటతో ప్రారంభమైన ఎన్టీఆర్ గళ ప్రస్థానం “కంత్రి” లో” మణిశర్మ సంగీత సారథ్యంలో  “వన్ టు త్రీ నేనొక కంత్రి”, “అదుర్స్” లో  దేవి శ్రీ ప్రసాద్ సారథ్యంలో “వేర్ ఈస్ ద పంచ కట్టు”, “రభస” చిత్రంలో తమన్ సారథ్యంలో ” రాకాసి రాకాసి”, నాన్నకు ప్రేమతో చిత్రంలో” ఐ వాన్న ఫాల్లో ఫాల్లో ఫాల్లో” తో పాటు కన్నడంలో chakravyuha చిత్రంలో పునీత్ రాజ్ కుమార్ కోసం పాడిన పాట వరకు  సాగింది. ఇలా నట గాయకుడిగా కూడా ఎన్టీఆర్ కు గొప్ప సక్సెస్ ఫుల్ ట్రాక్ ఉంది.

అన్నిటికంటే ముఖ్యంగా తెర మీద ఎంత గొప్ప నటుడైనప్పటికీ, ఇతరత్రా ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నప్పటికీ పబ్లిక్ లో మైక్ తీసుకుని మాట్లాడుతున్నప్పుడు జనాకర్షకంగా, జనరంజకంగా మాట్లాడ గలిగినప్పుడే ఒక సెలబ్రిటీకి నిజమైన జనామోదం లభిస్తుంది. అలాంటి జనరంజకమైన ప్రసంగ చాతుర్యంతో జనాన్ని అలరించడంలో ఎన్టీఆర్ భాషా శైలి అద్భుతం అనే చెప్పాలి. నిజానికి ఎన్టీఆర్ కు నటుడిగా ఎంత గొప్ప పేరు ఉందో గొప్ప వక్తగా అంతే గొప్ప పేరుంది.

బాల నటుడిగా ప్రారంభమై అద్భుత నటుడిగా , గాయకుడిగా, వక్తగా ఎదిగి తెలుగు వారి హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థాన విశిష్టతను సాధించుకున్న ఎన్టీఆర్ కు తన తరఫున తన పాఠకుల తరఫున జన్మదిన శుభాభినందనలు పలుకుతుంది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం“.

[subscribe]

[youtube_video videoid=ULaDVI59kzw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =