లక్ష్మీ బాంబ్ మూవీ కి గుడ్ బై -రాఘవ లారెన్స్

Raghava Lawrence Quits From Lakshmi Bomb,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News 2019 Latest Telugu Movie News,Raghava Lawrence About Kanchana Hindi Remake,Laxmmi Bomb Movie Latest Updates,Lawrence Statement on Akshay Kumar in Laxmmi Bomb,Raghava Lawrence Opts Out Of Kanchana Hindi Remake
Raghava Lawrence Quits From Laxmmi Bomb

కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ , తుషార్ ఎంటర్ టైన్ మెంట్ హౌస్, షబానా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై రాఘవ లారెన్స్ దర్శకత్వం లో తెలుగు, తమిళ భాషలలో సూపర్ హిట్ అయిన కాంచన మూవీ హిందీ లో లక్ష్మీ బాంబ్ గా రూపొందనున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో అక్షయ్ కుమార్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో, మాధవన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. లక్ష్మీ బాంబ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్రియేటివ్ డిఫరెన్స్ లతో లక్ష్మీ బాంబ్ మూవీ నుండి వైదొలుగుతున్నట్టు లారెన్స్ ప్రకటించారు.

లక్ష్మీ బాంబ్ మూవీ మేకర్స్ తో తనకు అగ్రిమెంట్ కాలేదని, తనతో మూవీ గురించి ఏ విషయం చర్చించలేదని, తనకు తెలియకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారని, ఐశ్వర్యం, పేరు ప్రతిష్ఠలకన్నా స్వాభిమానం ముఖ్యమని, ఆ మూవీ నుండి వైదొలుగుతున్నానని, నిర్మాతలు తమ ఇష్టప్రకారం వేరే డైరెక్టర్ ను నియమించుకోవచ్చని, తాను పర్సనల్ గా అక్షయ్ కుమార్ ను గౌరవిస్తానని, అక్షయ్ కుమార్ కు స్క్రిప్ట్ ఇచ్చి, ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకొంటానని, లక్ష్మీ బాంబ్ మూవీ ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నానని రాఘవ లారెన్స్ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here