ఆనంద్ దేవ‌ర‌కొండ ‘దొరసాని’ రిలీజ్ అప్‌డేట్‌

Anand Deverakonda Dorasani Release Date Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News 2019 Latest Telugu Movie News,Dorasani Movie Release Date,Anand Deverakonda Dorasani Movie Gets Ready for Release,Actor Anand Deverakonda New Movie Release Date,Anand Deverakonda Dorasani Movie Shooting News
Anand Deverakonda Dorasani Release Date Latest Update

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ త‌మ్ముడు ఆనంద్ దేవరకొండ క‌థానాయ‌కుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘దొరసాని’. ఈ సినిమాతోనే సీనియర్ నటుడు రాజశేఖర్ రెండో తనయ శివాత్మిక కూడా హీరోయిన్‌గా పరిచయం కానుంది. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి కె.వి.ఆర్.మహేంద్ర దర్శకత్వం వహించాడు.

ఇటీవల చిత్రీకరణను పూర్తి చేసుకున్న ‘దొరసాని’… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. కాగా… ఈ చిత్రాన్ని జూలై 5న విడుదల చేయనున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. మధుర శ్రీధర్, యష్ రంగినేని నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు సంబంధించిన విడుద‌ల తేదిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. మరి అన్న విజయ్ దేవరకొండ లాగే… త‌మ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా తనదైన ముద్ర వేస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here