రెండు వారాలు… ఐదు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌

5 Female Oriented Movies Releasing In 2 Weeks,2019 Latest Telugu Movie News,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News,5 Female Oriented Telug Movies,Best 5 Female Oriented Movies in Tollywood,Female Oriented Telugu Movies,5 Female Centric Movies In Tollywood
5 Female Oriented Movies Releasing In 2 Weeks

ఏప్రిల్ నెలలో వరుసగా మూడు వారాల పాటు తండ్రీకొడుకుల అనుబంధంతో రూపొందిన మూడు ఎమోష‌న‌ల్ డ్రామాలు రిలీజ్ కాగా… మే నెల హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మార‌నుంది. కేవ‌లం రెండు వారాల్లో ఐదు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ రాబోతున్నాయి. అంతేకాదు… ఈ చిత్రాలన్నీ భిన్నమైన కథాంశాలతో తెరకెక్కినవే కావడం విశేషం. ఆ చిత్రాలే సీత‌, లిసా, నాగ‌క‌న్య‌, అభినేత్రి 2, సువ‌ర్ణ సుంద‌రి. వీటిలో రెండు స్ట్ర‌యిట్ ఫిల్మ్స్ కాగా… మిగిలిన‌వి అనువాద చిత్రాలు కావ‌డం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… డబ్బే స‌ర్వ‌స్వం అనుకునే అమ్మాయి పాత్ర‌లో కాజల్ అగర్వాల్ న‌టించిన చిత్రం ‘సీత’. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 24న విడుదల కానుంది. ఇక ఇదే రోజు… అంజలి టైటిల్ రోల్‌లో నటించిన ‘లిసా’ కూడా విడుదల కానుంది. రాజు విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ హార‌ర్ మూవీని సురేష్ కొండేటి తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నాడు. అలాగే అదే మే 24న మ‌రో హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘నాగకన్య’ కూడా రిలీజ్‌ కానుంది. తమిళంలో ‘నీయా 2’గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘నాగకన్య’గా అనువదించి విడుదల చేస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్, రాయ్ లక్ష్మి, కేథ‌రిన్ థెరెస్సా లీడ్ రోల్స్‌లో నటించారు. ఇలా… మొత్తం మూడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ మే 24న రాబోతున్నాయి.

ఇక మే 31 విష‌యానికి వ‌స్తే… తమన్నా టైటిల్ రోల్ పోషించిన ‘అభినేత్రి 2’(తమిళంలో ‘దేవి 2’) త‌మిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. ‘అభినేత్రి’ (తమిళంలో ‘దేవి’)కి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాకి ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వ‌హించాడు. అలాగే… విజువ‌ల్ థ్రిల్లర్‌గా రూపొందిన‌ ‘సువర్ణసుందరి’ కూడా అదే రోజున విడుదల కానుంది. ఇందులో ‘ సాక్షి చౌదరి, పూర్ణ, జయప్రద ప్ర‌ధాన పాత్రలు పోషించారు.

మ‌రి… ఈ ఐదు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో … ఏయే చిత్రాల‌కు ప్ర‌జాద‌ర‌ణ ద‌క్కుతుందో చూద్దాం.

[subscribe]
[youtube_video videoid=cXlGET2oQh0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + twelve =