‘గ్యాంగ్‌లీడర్’లో నాని పాత్ర అదేనా?

Interesting Update About Nani Role In Gang Leader,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nani Role in Gang Leader Movie,Nani New Movie Gang Leader Latest Updates,Nani Character in Gang Leader Movie,Nani To Play an important Role in Gang Leader
Interesting Update About Nani Role In Gang Leader

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబినేష‌న్‌లో ‘గ్యాంగ్‌లీడర్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. వేర్వేరు ఏజ్ గ్రూప్‌ల‌కి చెందిన ఐదుగురు మహిళల గ్యాంగ్‌కు లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించే ఓ యువ‌కుడి కథగా ఈ చిత్రం రూపొందుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాలోని నాని పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే… ఈ సినిమాలో నాని మోస‌గాడిగా న‌టిస్తున్నాడ‌ట‌. తన తెలివితేటలతో చిన్న చిన్న దొంగతనాలు చేయడం… వాటికి ఆ లేడీస్ గ్యాంగ్ సహకరించడం… ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా ఉంటాయని తెలుస్తోంది.

‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ‌ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా… ఆగస్టు నెలలో విడుదల కానుంది.

[subscribe]
[youtube_video videoid=FMwGC9-TIhQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =