వ‌చ్చే వారం నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ తాజా షెడ్యూల్‌?

Alia Bhatt to Join RRR for Latest Schedule,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RRR Movie Next Shooting Schedule Details,Alia Bhatt Gearing Up For RRR Movie Shoot,RRR Movie Latest Updates,RRR Movie New Schedule Starts From Mid May,Alia Bhatt Begins Shoot For RRR Movie,RRR – Next Schedule From Mid May
Alia Bhatt to Join RRR for Latest Schedule

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఆర్ ఆర్ ఆర్‌. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా… ఇప్ప‌టికే కొంత‌మేర చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది. కాగా.. ఆ మ‌ధ్య తార‌క్‌, చెర్రీ వేర్వేరు సంద‌ర్భాల్లో గాయ‌ప‌డిన కార‌ణంగా చిత్రీక‌ర‌ణకు స్వ‌ల్ప విరామం ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు ఈ ఇద్ద‌రు హీరోలు గాయం నుంచి కోలుకోవ‌డంతో… ఈ నెల 21 నుంచి తాజా షెడ్యూల్‌ను ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం. హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో వేసిన ఓ స్పెష‌ల్ సెట్‌లో ఈ షెడ్యూల్‌ జ‌ర‌గ‌నున్న‌ట్టు టాక్. అంతేకాదు… ఈ షెడ్యూల్‌లో క‌థానాయిక‌ అలియా భ‌ట్ కూడా జాయిన్ కానుంద‌ని తెలుస్తోంది.

బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న ఆర్ ఆర్ ఆర్‌కి స్వ‌ర‌వాణి కీరవాణి బాణీలు అందిస్తున్నాడు. డి.వి.వి.దాన‌య్య ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న‌ ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ… వ‌చ్చే ఏడాది జూలై 30న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది.

[subscribe]
[youtube_video videoid=maAiixIZotg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 9 =