’96’ రీమేక్ అప్‌డేట్

96 Telugu Remake Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Telugu Remake of 96,Sharwanand and Samantha in 96 Movie Remake News,96 Telugu Remake Latest Shooting Schedule,Interesting News on 96 Telugu Remake
96 Telugu Remake Latest Update

తమిళనాట ఘన విజయం సాధించిన ’96’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు నిర్మిస్తుండగా… ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ సి. ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే… ఉగాది సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం… ఇప్పటికే ఈ సినిమా 50% షూటింగ్ పార్టు కంప్లీట్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే… శర్వానంద్ పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం స్వల్ప విరామం తీసుకుని… ఆ తరువాత వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మిగిలిన భాగాన్ని చిత్రీకరించనున్నారని టాక్. త‌దుప‌రి షెడ్యూల్‌లో శర్వా, సమంతపై కొన్ని రొమాంటిక్ సీన్స్‌తో పాటు మ‌రికొన్ని కీల‌క‌ సన్నివేశాలను కూడా తెరకెక్కించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు వినికిడి. జూలై నాటికి మొత్తం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి… సెప్టెంబర్‌లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా పేరు నిర్ణ‌యించ‌ని ఈ చిత్రం… తమిళంలో మాదిరి తెలుగునాట కూడా విజయఢంకా మోగిస్తుందేమో చూడాలి.

[subscribe]
[youtube_video videoid=3DUXiGluVjo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + four =