బాల‌య్యకి జోడీగా ‘ఆర్ ఎక్స్ 100 భామ‌?

RX 100 Heroine In Balakrishna New Movie?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RX 100 Heroine To Pair Up With Balakrishna,Payal Rajput Next With Balakrishna,RX 100 Heroine and Balakrishna To Work Together,Payal Rajput New Movie Updates,Actress Payal Rajput Roped For Balakrishna Next Film
RX 100 Heroine In Balakrishna New Movie?

ఆర్ ఎక్స్100తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది పాయల్ రాజపుత్. ఆ సినిమాలో బోల్డ్‌గా నటించి కుర్ర‌కారు మనసును దోచుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ సరసన ‘వెంకీ మామ’లోనూ, మాస్ మహారాజ్ రవితేజకు జంటగా ‘డిస్కో రాజా’లోనూ నటిస్తోంది. అంతేకాదు… మ‌రో సీనియ‌ర్ హీరో సినిమాలోనూ నాయిక‌గా న‌టించే అవకాశం పాయ‌ల్‌ దక్కించుకున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… నటసింహ నందమూరి బాలకృష్ణ, కోలీవుడ్ డైరెక్ట‌ర్ కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో ‘రూలర్’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమా తెరకెక్క‌నున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాల‌య్య క‌వ‌ల సోద‌రులుగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ట్లు టాలీవుడ్ టాక్. ఈ నేప‌థ్యంలో… ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్‌లకు స్థాన‌ముండ‌గా… అందులో ఒక హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్ కనిపించనుందని వినికిడి. ఇక మరో హీరోయిన్ పాత్రలో జై సింహా ఫేమ్‌ హరిప్రియ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే క‌థానాయిక‌లు ఎవ‌రో క్లారిటీ వ‌స్తుంది.కాగా.. ఈ నెల 17న ప్రారంభం కానున్న ఈ చిత్రం జూన్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

[subscribe]
[youtube_video videoid=ecFWQHkti_Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − eight =