గోవాలో ‘ఇస్మార్ట్ శంకర్’ ఆటాపాటా

iSmart Shankar Movie Song Shoot Happening In Goa,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,iSmart Shankar Movie Shooting in Goa,iSmart Shankar Movie Latest Updates,Ram Pothineni New Movie iSmart Shankar Shoot,iSmart Shankar Movie Shooting Schedule
iSmart Shankar Movie Song Shoot Happening In Goa

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘డబుల్ దిమాక్ హైదరాబాదీ’ అనేది ట్యాగ్‌లైన్‌. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవర్ ప్యాక్డ్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న‌ ఈ సినిమాకి సంబంధించిన టాకీ పార్టు ఇటీవ‌లే పూర్త‌య్యింది. కేవ‌లం నాలుగు పాట‌ల చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలి ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… ప్రస్తుతం గోవాలో ఓ పాట చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం. డ్యాన్స్ మాస్టర్ భాను పర్యవేక్షణలో రామ్, నభా నటేష్ పై ఈ పాటను తెరకెక్కిస్తున్నారు. అనంత‌రం మిగిలిన మూడు పాట‌ల‌ను శ‌ర‌వేగంగా పూర్తిచేయ‌నున్నారు. రామ్, పూరి కలయికలో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మ‌ణిశ‌ర్మ స్వరాలు స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి… పూరి, ఛార్మి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా… ఈ సినిమాని జూన్ నెలాఖరులో గాని లేదా జూలై మొదటి వారంలో గాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]
[youtube_video videoid=_KLYon_U6iE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =