‘చంద్ర‌ముఖి`కి మ‌రో సీక్వెల్‌?

Another Sequel Of Chandramukhi On Cards,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Chandramukhi To Get A Sequel In Hindi?,Chandramukhi Movie Latest Updates,Sequel Of Rajinikanth Chandramukhi,Chandramukhi 2 Planning Details,Chandramukhi 2 in Bollywood
Another Sequel Of Chandramukhi On Cards

‘చంద్రముఖి’… 2005లో విడుదలైన ఈ త‌మిళ చిత్రం అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ కాసుల వర్షం కురిపించి బాక్సాఫీస్ వ‌ద్ద‌ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మ‌ల‌యాళ చిత్రం మ‌ణిచిత్ర తాళు(1993) ఆధారంగా రూపొందిన ఈ సినిమాని… 2007లో ‘భూల్ భులయ్యా’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. క‌ట్ చేస్తే… 12 ఏళ్ళ త‌రువాత‌ ‘భూల్ భులయ్యా’కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత భూషణ్ కుమార్.

అయితే… ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘నాగవల్లి’కి… ‘భూల్ భులయ్యా’ సీక్వెల్‌గా తెర‌కెక్క‌బోయే ఈ కొత్త చిత్రానికి ఎలాంటి సంబంధం లేదట. రచయిత, దర్శకుడు ఫర్హాద్ సామ్‌జీ చెప్పిన క‌థ న‌చ్చడంతో ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారట. అలాగే ఒరిజినల్ వెర్షన్‌లో ప్రధాన పాత్రలు పోషించిన అక్షయ్ కుమార్, విద్యా బాలన్ కాకుండా… ఈ సీక్వెల్ కోసం వేరే వాళ్ళని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాడ‌ట నిర్మాత. ఆ నటీనటులు ఎవరనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మ‌రి… తెలుగు వెర్ష‌న్ సీక్వెల్ నాగ‌వ‌ల్లి ఆశించిన విజ‌యం సాధించ‌ని నేప‌థ్యంలో… హిందీ వెర్ష‌న్ అయినా మంచి ఫ‌లితాన్ని అందుకుంటుందేమో చూద్దాం.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here