గత ఏడాది ‘భాగమతి’, ‘తొలిప్రేమ’, ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి పలు విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించిన తమన్… ఈ ఏడాది ‘మజిలీ’ వంటి ఫ్యామిలీ ఎమెషనల్ మూవీకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో… తాజాగా మరో ఫ్యామిలీ ఎమోషనల్ మూవీకి సంగీత దర్శకుడిగా పని చేసే అవకాశం తమన్‌ని వరించిందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మెగా హీరో సాయితేజ్, యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి కలయికలో ‘ప్రతి రోజూ పండగే’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు తమన్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసాడట మారుతి. ఇదివరకు మారుతి, తమన్ కాంబినేషన్‌లో ‘మహానుభావుడు’ (2017) వంటి విజయవంతమైన చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే… సాయితేజ్ హీరోగా రూపొందిన తిక్క
, విన్నర్
, జవాన్
, ఇంటిలిజింట్
చిత్రాలకు తమన్ స్వరాలు అందించాడు.
ఇదిలా ఉంటే… వచ్చే వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం… తాత, తండ్రి, మనవడు ఇలా మూడు తరాల మధ్య సాగే కథతో సాగుతుందని సమాచారం. కొడుకు పాత్రలో సాయితేజ్ కనిపించనుండగా… తండ్రి పాత్రలో విలక్షణ నటుడు రావు రమేష్ దర్శనమివ్వనున్నాడు. ఇక ఈ సినిమాలో నటించే కథానాయికతో పాటు మిగిలిన సాంకేతిక వర్గం వివరాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
[subscribe]
[youtube_video videoid=7WGdYZgzJiM ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: