45 రోజుల లాంగ్ షెడ్యూల్‌లో ‘గ్యాంగ్‌లీడర్’

Nani Gang Leader Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nani Gang Leader Movie Shooting News,Nani Upcoming Film Gang Leader Shoot,Nani New Movie Gang Leader Shooting Location,Nani Shoots Rigorously For Gang Leader
Nani Gang Leader Movie Latest Update

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబినేష‌న్‌లో ‘గ్యాంగ్‌లీడర్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో… ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. అనిరుధ్‌ రవిచందర్ సంగీత‌మందిస్తున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ‌ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… వేర్వేరు ఏజ్ గ్రూప్‌ల‌కి చెందిన ఐదుగురు మహిళల గ్యాంగ్‌కు లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించే ఓ యువ‌కుడి చుట్టూ తిరిగే క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం… ఇప్ప‌టికే కొంత‌మేర షూటింగ్ జ‌రుపుకుంది. కాగా… మరో రెండు రోజుల్లో తదుపరి షెడ్యూల్‌ను కూడా ప్రారంభించనున్నారని స‌మాచారం. ఇందులో భాగంగా… హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో వేసిన ఓ ప్రత్యేక ఇంటి సెట్‌లో 45 రోజులపాటు నిరవధికంగా చిత్రీకరణ జరిపేందుకు ప్లాన్ జ‌రుగుతోంద‌ట‌. మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ పూర్తిచేసి… ఆగ‌స్టు నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

[subscribe]
[youtube_video videoid=FMwGC9-TIhQ ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =