‘సాహో’ హిందీ వెర్ష‌న్ కోసం ప్ర‌భాస్ డ‌బ్బింగ్‌?

Prabhas To Dub For Saaho Hindi Version?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prabhas Flexes His Baritone For Saaho,Saaho Hindi Version,Prabhas Saaho Latest Updates,Prabhas Own Voice For Saaho Hindi Version,Prabhas Gears Up To Dub For Saaho
Prabhas To Dub For Saaho Hindi Version?

త‌మ‌ పాత్ర‌కు తామే డ‌బ్బింగ్ చెప్పుకుంటే… ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం జరగడమే కాకుండా… ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా దగ్గరవ్వొచ్చు. అందుకే ఈ మధ్య డబ్బింగ్ చెప్పుకోవడానికి చాలా మంది తార‌లు అమితాస‌క్తి చూపిస్తున్నారు. ఇంతవరకు ఈ జాబితాలో కథానాయికలనే చూసాం. కాని ఇప్పుడు ఓ స్టార్ హీరో చేర‌బోతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ‘బాహుబలి’ సిరీస్‌తో కేవలం దక్షిణాదినే గాక… ఉత్తరాదిన కూడా అభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్. ఆ సినిమా హిందీ వెర్షన్‌కు సంబంధించి ప్రభాస్ పాత్రకు ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో విల‌న్‌గా న‌టించిన‌ శరద్ ఖేల్కర్ డబ్బింగ్ చెప్పడం జరిగింది. కాని… ఈ సారి మాత్రం తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడానికి సిద్ధపడ్డాడట ప్రభాస్. అందుకే ట్రైలింగ్వ‌ల్ మూవీగా తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సాహో’ హిందీ వెర్షన్‌ కోసం రోజుకు ఆరు గంటల సేపు హిందీ ప్రాక్టీస్‌ చేస్తున్నాడని సమాచారం.

అంతేకాదు… ఈ నెలాఖరు నుంచి ప్రభాస్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా ‘సాహో’ విజ‌యానికి దోహ‌ద‌ప‌డే ప్ర‌తీ విష‌యంలోనూ ప్ర‌భాస్ క‌ష్ట‌ప‌డుతుండ‌డం అత‌ని అభిమానుల‌ను మ‌రింత అల‌రిస్తోంది. కాగా… బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ తెర‌కెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ట్రైలింగ్వ‌ల్‌ మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

[subscribe]
[youtube_video videoid=3gQXWLW3xV4 ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =