ఈ నెల 15న‌ ‘ఇస్మార్ట్ శంకర్’ టీజ‌ర్‌

ISmart Shankar Movie Teaser Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,ISmart Shankar Movie Teaser Release Date Fixed,ISmart Shankar Teaser Gets a Release Date,ISmart Shankar Movie Teaser Release Date Revealed,ISmart Shankar Movie Teaser Release Date Confirmed,ISmart Shankar Movie Teaser Release Date Announced
ISmart Shankar Movie Teaser Release Date Locked

ఎనర్జిటిక్‌ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తొలి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్‌. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ పవర్ ప్యాక్డ్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్… తాజాగా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా నాలుగు పాటల చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలి ఉంది. వీటిలో రెండు పాటలను త్వ‌ర‌లోనే విదేశాల్లో చిత్రీకరించేందుకు యూనిట్‌ ప్లాన్ చేస్తోంద‌ట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమా టీజ‌ర్‌ను రామ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ నెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పూరీ జగన్నాథ్ స్టైల్‌లోనే ఈ టీజ‌ర్ ఉండబోతోందని వినికిడి. “మెలోడీ బ్ర‌హ్మ” మ‌ణిశ‌ర్మ స్వరాలు స‌మ‌కూరుస్తున్న ఈ సినిమాకి… ఛార్మి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్న విష‌యం తెలిసిందే. జూన్ ద్వితీయార్ధంలో లేదా జూలైలో ఈ సినిమా విడుద‌ల కానుంద‌ని స‌మాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =