మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెహ‌రీన్?

Mehreen Gives Green Signal For Another Telugu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mehreen Upcoming Movie News,Mehreen Next FIlm Updates,Mehreen Latest Movie News
Mehreen Gives Green Signal For Another Telugu Movie

కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ‌, మ‌హానుభావుడు, రాజా ది గ్రేట్‌ చిత్రాల‌తో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది మెహ‌రీన్‌. ఇక ఈ సంక్రాంతికి విడుద‌లైన ఎఫ్ 2తో మ‌రో సూప‌ర్‌హిట్‌ని త‌న ఖాతాలో వేసుకుందీ స్ట‌న్నింగ్ బ్యూటీ. ఈ సినిమాలో హనీగా ఆకట్టుకున్న మెహ‌రీన్‌… స్వ‌ల్ప విరామం త‌రువాత కొత్త చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే ప‌నిలో ప‌డింద‌ని టాక్‌. ఇప్ప‌టికే యాక్షన్ హీరో గోపీచంద్, తమిళ దర్శకుడు తిరు కాంబినేషన్‌లో తెర‌కెక్క‌బోయే సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా మెహరీన్ ఎంపికైనట్టు ఆ మ‌ధ్య వార్త‌లు వచ్చాయి. ఇప్పుడు మరో సినిమాలో కూడా మెహ‌రీన్‌ క‌థానాయిక‌గా ఎంపిక అయిన‌ట్టు టాలీవుడ్ టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… నాగ శౌర్య హీరోగా నూతన దర్శకుడు తేజ ఓ సినిమాని రూపొందించ‌నున్నాడు. కాగా… ఇందులోని కథానాయిక పాత్ర కోసం… మెహరీన్‌ను సంప్రదించాడ‌ట తేజ. ద‌ర్శ‌కుడు కథ చెప్పిన విధానంతో పాటు… తన పాత్ర కూడా నచ్చడంతో… మెహరీన్ ఈ సినిమాలో న‌టించేందుకు అంగీక‌రించింద‌ని స‌మాచారం. ఏదేమైనా… గోపీచంద్‌, నాగ‌శౌర్య‌ సినిమాలకు సంబంధించి మెహ‌రీన్ ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం ఓ పంజాబీ సినిమాలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది మెహ‌రీన్‌.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 15 =