టైటానిక్ ను ముంచేసిన అవెంజర్స్

James Cameron Congratulates Avengers Endgame For Sinking Titanic Records,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Director James Cameron congratulates Avengers: Endgame,James Cameron Congratulates Avengers: Endgame for Sinking
James Cameron congratulates Avengers Endgame For Sinking Titanic Records

అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. మార్వెల్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ కు భయపడి పలు సినిమాల రిలీజ్ డేట్లను మార్చుకుంటేనే అర్థమవుతుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల్లో క్రేజ్ ఏంటో.. ఇప్పటికే రూ.15,302 కోట్లను దాటేసి సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే ఎన్నో సినిమాల రికార్డులను కొల్లగొట్టిన ఈ సినిమా.. తాజాగా.. టైటానిక్ సినిమా కలెక్షన్లను బీట్ చేసింది. 1997లో వచ్చిన టైటానిక్ సినిమా ఏకంగా రూ.15,000 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్బంగా అవతార్, టైటానిక్ సినిమాల దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘అవెంజర్స్.. ఎండ్ గేమ్’పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు.‘నిజమైన టైటానిక్‌ ఓడను ఓ ఐస్‌బర్గ్ ముంచేసింది. కానీ నా ‘టైటానిక్‌’ను మీ ‘అవెంజర్స్‌’ ముంచేసింది. మా నిర్మాణ సంస్థ లైట్‌స్టోర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని సిబ్బంది మీ విజయానికి సెల్యూట్‌ చేస్తున్నారు. సినీ పరిశ్రమ సజీవంగానే కాదు సరికొత్త ఎత్తుకు చేరుకుందని మీరు నిరూపించారు’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అవెంజర్స్ లోగోను ఢీకొట్టిన టైటానిక్ మునిగిపోతున్నట్లు డిజైన్ చేసిన ఓ ఫొటోను జేమ్స్ కామెరూన్ ట్వీట్ కు జతచేశారు.

[subscribe]

[youtube_video videoid= r8zBYHs-bws]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 20 =