యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండకు హ్యాపీ బ‌ర్త్‌డే

Wishing Youth Icon Vijay Deverakonda A Very Happy Birthday,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Very Happy Birthday to Vijay Deverakonda,Celebs Wishes To Youth Icon Vijay Deverakonda,Vijay Deverakonda Birthday Celebrations News,#HBDVijayDeverakonda
Wishing Youth Icon Vijay Deverakonda A Very Happy Birthday

“ప్రతిభే ఉంటే పై వాడైనా నిన్నాపలేడు” … ఓ సూప‌ర్ హిట్ సాంగ్‌లోని ఈ లైన్‌ యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండకు సరిగ్గా సరిపోతుంది. న‌టుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ… వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ… నేడు టాలీవుడ్ గర్వించదగ్గ యువ కథానాయకులలో ఒకడిగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. కాగా… తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్… నేడు 30వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా విజ‌య్‌ న‌ట‌నాప్ర‌స్థానానికి సంబంధించి కొన్ని విశేషాలు..

కెరీర్ ఆరంభంలో ‘నువ్విలా’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రాల్లో చిన్న చిన్న‌ పాత్రల్లో క‌నిపించిన‌ విజయ్ దేవరకొండ… నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎవడే సుబ్రమణ్యం’లో ఓ కీలక పాత్రలో న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను పొందాడు. న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అనంత‌రం తరుణ్ భాస్కర్ రూపొందించిన ‘పెళ్లిచూపులు’తో సోలో హీరోగా తొలి అడుగులు వేశాడు విజ‌య్‌. ఆ సినిమాలోని తన అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను, ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌ను ఆకట్టుకున్నాడు. కట్ చేస్తే… ఏడాది త‌రువాత త‌న కెరీర్‌ని మ‌లుపు తిప్పిన సినిమా వ‌చ్చింది. అదే… అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో… విజయ్ న‌ట‌న‌కి ఫిదా కాని కుర్ర‌కారు లేదంటే అతిశ‌యోక్తి కాదు. విజ‌య్ ని ఓవ‌ర్ నైట్ స్టార్‌ని చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించింది. అంతేకాదు… విజ‌య్‌ని యూత్‌ ఐకాన్‌గా మార్చేసింది. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు… తమిళనాట కూడా అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు విజయ్. అలాగే… ఈ సినిమాకిగాను ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.

ఇక గ‌త ఏడాది ‘మహానటి’, ‘గీతగోవిందం’, ‘టాక్సీవాలా’వంటి విజయవంతమైన చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువయిపోయాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. వీటిలో గీత గోవిందం మీడియం బ‌డ్జెట్ సినిమాల్లో భారీ వ‌సూళ్ళు సాధించిన చిత్రంగా నిల‌చింది. తాజాగా నూత‌న దర్శకుడు భరత్ కమ్మ తెర‌కెక్కించిన ‘డియర్ కామ్రేడ్’లో న‌టించాడు విజ‌య్‌. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా జూలై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే క్రాంతి మాధ‌వ్ రూపొందిస్తున్న సినిమాలోనూ హీరోగా న‌టిస్తున్నాడు. దీంతో పాటు హీరో అనే మ‌ల్టీలింగ్వ‌ల్ మూవీతోనూ బిజీగా ఉన్నాడు విజ‌య్‌. మున్ముందు… మ‌రిన్ని విజ‌యాల‌తో విజ‌య్ కెరీర్ మ‌రింత స‌క్సెస్‌ఫుల్‌గా సాగాల‌ని ఆకాంక్షిద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here